
రజనీకాంత్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నారు.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా వరుస విజయాలతో సక్సెస్ అందుకుంటూ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రజనీకాంత్ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండేవారట. అలా మూడు సంవత్సరాలుగా డైరెక్టర్ లోకేష్ చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదని తెలుస్తోంది. అయితే వీరిద్దరి కలయికలో సినిమా రావాలని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు ఉన్నది. అయితే ఆ ప్రస్తావన మాత్రం ఎవరి దగ్గర తీసుకురాలేదు. కానీ ఒకరోజు మాటల మధ్యలో లోకేష్, రజనీకాంత్ తో సినిమా చేయడానికి తాను మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నాననే విషయాన్ని అనిరుధ్ తెలియజేశారట. ఆ సమయంలోనే అనిరుధ్ కి 20 నిమిషాల పాటు కథను చెప్పాడట.
ఇక స్టోరీ లైన్ విన్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వెంటనే సూపర్ స్టార్ రజినీకాంత్ కి మెసేజ్ చేశారట.ఆ వెంటనే కూడా రిప్లై రావడంతో ఆ మరుసటి రోజే.. లోకేష్ ,ఆనిరుధ్ ఇద్దరూ రజనీకాంత్ ఉండే లొకేషన్ కి వెళ్లి కథ చెప్పడం జరిగిందట. కథ విన్న తర్వాత రజనీకాంత్ అందులో కొన్ని మార్పులను చేయమని సలహా ఇచ్చారట.అప్పటికప్పుడు లోకేష్ కనకరాజు మార్పులు చేర్పులు చేయడంతో రజనీకాంత్ కూడా ఈ సినిమా కథ విన్నాక ఓకే చెప్పి సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అలా కూలి సినిమా తెరకెక్కించడం వెనుక అనిరుధ్ హస్తం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అనిరుధ్ బయట పెట్టడంతో అసలు విషయం బయటపడింది.