కొద్ది నిమిషాలే మిగిలి ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద బిగ్  ఫైట్ స్టార్ట్ కాబోతోంది. ఆగస్టు 14వ తేదీ వార్ 2, అలాగే కూలీ రెండు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. గతంలో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సందర్భాలు ఎన్నో వచ్చినా, ఈ రెండు సినిమాలకు లభించిన హీట్ మాత్రం అంతకు మించినది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. ఆగస్టు 14వ తేదీన రెండు బడా సినిమాలు విడుదలవ్వడం సినీ లవర్స్‌కి బిగ్ జాతరలా మారింది. రెండు సినిమాలు కూడా పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్‌లో ఏ సినిమా ఏ సినిమాని టచ్ చేయలేనంత స్థాయిలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మల్టీప్లెక్స్‌లో ఇప్పుడు టికెట్ దొరకడం చాలా కష్టం. సింగిల్ స్క్రీన్ పరిస్థితి కూడా అలాంటిదే. రేపు థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపించడం ఖాయం అని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

గురువారం సినిమాలు విడుదలవుతుండగా.. శుక్ర, శని, ఆదివారాలు సెలవులు కావడం ఈ రెండు సినిమాలకు ప్లస్‌గా మారుతుంది. పైగా ఈ రెండు సినిమాలు తప్పిస్తే, మిగతా బడా సినిమాల నుండి ఎలాంటి పోటీ లేదు. ఇంతకంటే మంచి ఛాన్స్ ఈ సినిమాలకు రానేరాదు. ఎన్టీఆర్ సినిమా ఎలా ఉన్నా, అభిమానులు తప్పక చూస్తారు. ఆయన రేంజ్ అలాంటిది. రజనీకాంత్‌కి కూడా అదే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే, ఇటీవలి కాలంలో రజనీకాంత్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం వల్ల ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యమని సినీ ప్రముఖులు అంటున్నారు.

బలమైన స్టార్ కాస్ట్ కూలీకి ప్లస్‌గా మారవచ్చని అంచనా. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2పై యంగ్‌స్టర్స్ భారీగా హోప్స్ పెట్టుకున్నారు. యాక్షన్ సీన్స్, ఫైట్స్, పాటలు, డాన్స్ .. యంగ్‌స్టార్ సినిమా నుంచి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని నమ్మకం ఉంది. ఏపీలో పెరిగిన టికెట్ ధరలు వార్ 2కి అదనపు అడ్వాంటేజ్ తీసుకొచ్చాయి. ప్రీమియర్ షోలకూ అనుమతి వచ్చేసింది. టికెట్ ధరను ₹500 వరకూ పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం. దీని వల్ల తొలి రోజు కలెక్షన్లు కూలీ కంటే వార్ 2 ఎక్కువగా ఉండొచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏపీలో కూలీ టికెట్లు కార్పొరేట్ స్టైల్‌లో బల్క్ బుకింగ్స్ అయ్యాయి. ఇది సినిమాకు ఉన్న హైప్‌ను చూపిస్తున్నప్పటికీ, కొన్నిసార్లు మైనస్‌గా మారవచ్చని కూడా అంటున్నారు. అయినా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే, వార్ 2 రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకేసారి రెండు బడా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉండటం.. పైగా స్టార్ హీరోల సినిమాలు కావడం వల్ల సినీ లవర్స్‌కి ఇది నిజమైన పండుగ అని చెప్పవచ్చు. వచ్చే మూడు, నాలుగు రోజులు థియేటర్స్‌లో సందడి తప్పదు. గురువారం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం ఇండిపెండెన్స్ డే హాలిడే, 16వ తేదీ శనివారం కృష్ణాష్టమి, 17వ తేదీ ఆదివారం. ఇవన్నీ సినిమాలకు కొత్త ఉత్సాహం ఇవ్వనున్నాయి. చూద్దాం మరి… ఏ సినిమా బాక్సాఫీస్‌ దుమ్ములేపుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: