నాగార్జున ఫస్ట్ టైం వేరే హీరో సినిమాలో విలన్ పాత్రలో నటించారు అంటే ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పాత్ర బాగా లేకపోతే వేరే హీరో సినిమాలో నెగిటివ్ రోల్ ఎందుకు చేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే రీసెంట్ గా వచ్చిన కుబేర మూవీలో నాగార్జున దీపక్ అనేఅద్భుతమైన పాత్రలో నటించారు.అలాగే కూలీ మూవీలో రజినీకాంత్ సైమన్ అనే విలన్ పాత్రలో నటించారు. ఇక ఇందులో విలనిజం చాలా ఘోరంగా ఉంటుందని, ఈ సినిమాని మాత్రం నా మనవళ్లకు చూపించను అంటూ రీసెంట్గా కూలీ మూవీ ప్రమోషన్స్ లో నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే.అయితే అలాంటి నాగార్జున తాజాగా కూలీ మూవీ ప్రమోషన్స్ లో నన్ను జోకర్ ని చేసేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మరి ఎందుకు నాగార్జున అలా ఫీల్ అవుతున్నారు.. జోకర్ తో తన పాత్రని ఎందుకు పోల్చుకున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

తాజాగా నాగార్జున శృతిహాసన్ కలిసి కూలీ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నాగార్జున తన పాత్ర గురించి చెబుతూ మొదట లోకేష్ నా దగ్గరికి వచ్చి మీతో సినిమా చేయాలనుకుంటున్నాను అని డైరెక్ట్ గా సైమన్ పాత్రనే చెప్పారు. అయితే ఆయన చెప్పిన పాత్ర ఎలా ఉంటుందో మళ్ళీ మళ్ళీ వినడం కోసం నేను దాన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఓ బిగ్ స్టెప్ వేస్తున్నాను కాబట్టి ఆ పాత్రని మళ్లీ విన్నాను. అయితే లోకేష్ నేను నటించిన రాక్షసుడు సినిమాకి పెద్ద ఫ్యాన్ అట. అందుకే మళ్ళీ అలాంటి పాత్రలో నన్ను చూపించాలి అనుకున్నాడు. అందుకోసం జుట్టు కూడా పెంచమన్నాడు. అప్పటినుండి జుట్టు కూడా పెంచేశాను. ఇక ఈ సినిమాలో సైమన్ పాత్రలో నటించినప్పుడు నాకు అచ్చం జోకర్ పాత్రలో నటించినట్టు అనిపించింది. ఎందుకంటే జోకర్ పాత్ర కూడా ఇలాగే ఉంటుంది.జోకర్  డ్రెస్సులు పర్పుల్ మరియు క్రీమ్ కలర్ లోనే ఉన్నాయి.

అయితే నాకు జోకర్లా అనిపించడానికి కారణం హీత్ లెడ్జర్ నటించిన బ్యాట్ మాన్ మూవీలోని జోకర్ పాత్ర లోకేష్ మైండ్ లో ఉంది కావచ్చు.అందుకే నన్ను ఈ సినిమాలో సైమన్ పాత్రలో మ్యాడ్ నెస్ కలిపి చూపించారు. ఇక జోకర్ వేసుకున్న డ్రెస్సులకు దగ్గరగా ఉండే డ్రెస్సులే నా పాత్ర కోసం కూడా డిజైన్ చేయించడంతో లోకేష్  నన్ను జోకర్ గా చూపించాడు అనిపించింది. అయితే జోకర్ కి వేసినట్టు మౌత్ కి స్క్రాచెస్ వెయ్యలేదు బతికిపోయా అంటూ నాగార్జున నవ్వుకున్నారు. అయితే ఈ సినిమాలో బ్యాట్ మాన్ సినిమాలో చేసిన జోకర్ పాత్ర వేసుకున్న డ్రెస్ లాంటిది నాగార్జున వేసుకున్నాక నేను కోరుకున్న లుక్ ఇదే అంటూ లోకేష్ అనుకున్నారట. అందుకే నాగార్జునకి అలా అనిపించిందట.ఇక సైమన్ పాత్ర చాలా అద్భుతంగా ఉందని,ఇది ప్రేక్షకులలో బలంగా ఉండిపోతుంది అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: