ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో శృతి హాసన్ ఒకరు. ఈమె ఇప్పటివరకు అనేక భాషల సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకుంది. తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన ఈమెకు మొదటి విజయం మాత్రం తెలుగు సినిమాల ద్వారా దక్కింది. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి , ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. శృతి హాసన్ ఎక్కువ శాతం నలుపు రంగు దుస్తులను ధరిస్తూ ఉంటుంది.

ఆమె సోషల్ మీడియాలో చూసినా కూడా ఎక్కువ శాతం నలుపు రంగు దుస్తులను వేసుకొని కనిపిస్తూ ఉంటుంది. తాజాగా శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా తాను నలుపు రంగు దుస్తులను ఎందుకు ధరిస్తాను అనే విషయాన్ని క్లియర్ గా ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా శృతి హాసన్ మాట్లాడుతూ ... నేను ఎక్కువగా నలుపు రంగు దుస్తులను ధరిస్తూ ఉంటాను. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. నలుపు రంగు దుస్తులను ధరించినట్లయితే ఎంత మందిలో ఉన్నా మన ప్రత్యేకంగా ఫోకస్ అవుతూ ఉంటాము. ఇక నా స్కిన్ టోన్ కు నలుపు రంగు అద్భుతంగా సెట్ అవుతుంది ఆ కారణంతో కూడా నేను నలుపు రంగు దుస్తులను ధరిస్తూ ఉంటాను. కొంత మంది నలుపు రంగును అశుభంగా భావిస్తూ ఉంటారు.

కానీ నా వరకు మాత్రం అది ఎంతో ఆనందం , మరియు ఫుల్ గా కాన్ఫిడెన్స్ ను ఇచ్చే కలర్. కొన్ని సందర్భాలలో ఏదైనా పని చేయగలమా ..? లేదా ..? అని అనుమానం వచ్చినప్పుడు నాకు నలుపు రంగులు దుస్తులు ధరించినట్లయితే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తోంది అందుకు కూడా నేను నలుపు రంగు దుస్తులను ధరిస్తాను అని శృతి హాసన్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. తాజాగా శృతి హాసన్ , రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా ఆగస్టు 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: