తాజాగా ఆగస్టు 14 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన వార్ 2 అనే హిందీ సినిమా , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నాగార్జున విలన్ పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రెండు మూవీలపై కూడా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ రెండు మూవీలకు అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా ప్రపంచ వ్యాప్తంగా జరిగాయి. ఈ రెండు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వ్యాప్తంగా విడుదల అయ్యాయి. అలాగే ఈ రెండు మూవీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా జరిగాయి. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీలలో కూలీ సినిమాతో పోలిస్తే మొదటి రోజు వార్ 2 మూవీ కి భారీ కలక్షన్లు దక్కాయి. కానీ రెండవ రోజు మాత్రం వార్ 2 మూవీ తో పోలిస్తే కూలీ సినిమాకు పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. మరి ఈ మూవీలకు రోజు వారిగా ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఈ రెండు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

వార్ 2 మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21.76 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రెండవ రోజు వార్ 2 మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.31 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వార్ 2 మూవీ కి 31.01 కోట్ల షేర్ ... 42.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కూలీ మూవీ కి 14 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 10.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి కూలీ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24.75 కోట్ల షేర్ ... 35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: