"మీనాక్షి చౌదరి"... ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా మారుమ్రోగిపోతున్న పేరు. రష్మిక మందన్న తర్వాత అలాంటి క్రేజ్ సాధించిన హీరోయిన్ ఎవరు అంటే, టక్కున చెప్పే పేరు మీనాక్షి చౌదరి. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో ఆమె రేంజ్ మొత్తం మారిపోయింది. అంతకు ముందు లక్కీ భాస్కర్ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఆ తర్వాత గోట్ సినిమాతో 450 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇప్పుడు "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో 300 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో, మీనాక్షి ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా, అది పెద్ద హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది.


రీసెంట్‌గా మీనాక్షి ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాలుగు సినిమాలను చేతిలో పట్టుకొని ఉన్న మీనాక్షి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ మరింత హాట్‌గా ట్రెండ్ అవుతోంది. "ఉదయం సూర్యుడిని ముద్దు పెట్టుకున్నట్లు అనిపించింది... సాయంత్రం నక్షత్రాల మధ్య ఉన్నట్లుగా అనిపించింది. ఇది చాలా డిఫరెంట్ ఫీలింగ్" అంటూ మీనాక్షి తన పిక్చర్స్‌తో కోటేషన్ రాసుకొచ్చింది. ఇది అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇది చాలా వైరల్ అవుతుంది.



ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "చాలా చక్కగా ఉన్నావు" అని కొందరు, "చాలా నాటిగా పోస్ట్ పెట్టావు" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి, మీనాక్షి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే మీనాక్షి ముందు ఓ డెంటిస్ట్. ఆ తరువాత సినిమాల పై ఉండే ఇంట్రెస్ట్ తో ఈ రంగలో వచ్చింది. మొదటగా ఫ్లాప్స్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది..!!



మరింత సమాచారం తెలుసుకోండి: