
త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అఖీరా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గానీ, రేణు దేశాయ్ గానీ అధికారికంగా స్పందించలేదు. అయితే, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే దర్శకుడిని ఫిక్స్ చేశారని, హీరోయిన్ కోసం వేట మొదలైందని అంటున్నారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త వైరల్ అవుతోంది. అఖీరానందన్ కి స్పెషల్ బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. సినిమాలకే కాకుండా ప్రజాసేవకు కూడా అఖీరా కనెక్ట్ కావాలని, "పవన్ కళ్యాణ్ కొడుకు అంటే సినిమాల్లో నటించేవాడు మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేసే వ్యక్తి కూడా అవ్వాలి" అని భావించి పవన్ కళ్యాణ్ ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఆ బాధ్యతల ఏంటంటేఅ.. పేద ప్రజలు నీరు, ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారా? చుట్టుపక్కల చిన్న గ్రామాల అవసరాలు ఏమిటి? ప్రభుత్వం అందించే పథకాలు వారికి చేరుతున్నాయా? అనే విషయాలను తెలుసుకోవాలని అఖీరాకు స్పెషల్ బాధ్యతలు ఇచ్చారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. "హీరోగానే కాదు, ప్రజాసేవకుడిగానూ తన కొడుకును తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ ఆలోచించడం నిజంగా గొప్ప విషయం" అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.