ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గీతాంజలి సినిమాలో హీరోయిన్‌గా నటించిన గిరిజ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం జగపతి బాబు తాజాగా స్టార్ట్ చేసిన “జయంబు నిశ్చయంబురా” షో. ఈ షోకు మొదటి ఎపిసోడ్‌లో సెలబ్రిటీ చీఫ్ గెస్ట్‌గా నాగార్జున వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో ఇద్దరూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అల్లరి అల్లరిగా మాట్లాడుతూ సందడి చేశారు. ఇటీవలే జీ5లో రిలీజ్ అయిన ఈ ఎపిసోడ్‌లో, నాగార్జున గీతాంజలి సినిమా చేయకముందు తన కెరీర్ ఎలా ఉందో, ఆ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఈ సినిమా ఎందుకు చేయాలని తాను నిర్ణయించుకున్నానన్న విషయాన్ని కూడా హైలైట్ చేశారు.


“మౌనరాగం సినిమా చూసి నేను నెలరోజుల పాటు దర్శకుడు మణిరత్నం ఇంటి చుట్టూ తిరిగాను. ఆయన వెంటపడుతూ డైలీ ఉదయం వెళ్ళేవాడిని. చివరకు ఆయనను కన్విన్స్ చేసి గీతాంజలి సినిమా చేశాను” అని నాగార్జున షోలో చెప్పారు. ఈ సందర్భంగా గిరిజ గురించి నాగార్జునకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు జగపతి బాబు. గిరిజ పంపిన వీడియోని ప్లే చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.."నాగార్జున లాంటి యాక్టర్‌తో నా ఫస్ట్ సినిమా చేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా కూల్ పర్సన్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. నాపై జోక్స్ వేసి ఆటపట్టించేవారు. గీతాంజలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన నన్ను ఎంతో ప్రేమగా, పొలైట్‌గా అభినందించారు. ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేను. నా తొలి సినిమాకి ఇలాంటి బిగ్ స్టార్‌తో నటించడం నాకు గర్వకారణం. థాంక్యూ సో మచ్ నాగార్జున. నువ్వు ఒక లెజెండ్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువే. నిన్ను ఇలా చూడటం వండర్ఫుల్” అని గిరిజ చెప్పారు.



ఆ వీడియో చూసి నాగార్జున ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, గీతాంజలి సినిమాలో కనిపించిన గిరిజ అప్పట్లో ఎలా ఉందో, ఇప్పుడు ఆమె ఎంతగా మారిపోయిందో జనాలు హైలైట్ చేస్తున్నారు. వయసుతో సహజంగానే రూపంలో మార్పులు వచ్చినా, గిరిజ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే, గీతాంజలి సినిమా చూసిన వారు గిరిజను కాకుండా “గీత”గానే గుర్తుపెట్టుకున్నారు. గతంలో చాలా ఇంటర్వ్యూలకు గిరిజ “ఇవ్వను” అని చెప్పింది. కానీ ఈసారి నాగార్జునను సర్‌ప్రైజ్ చేయడానికి, కుటుంబానికి ఇష్టం లేకపోయినా వీడియో షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: