ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి అంత తేలికగా లేదు. ఒక సినిమాలో నటించాలంటే కేవలం నటన చాలు కాదు, కొన్నిసార్లు చాలా సాక్రిఫైజులు కూడా చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఏ హీరోయిన్ తక్కువ పారితోషికానికి అంగీకరిస్తే ఆమెను వెంటనే ఎంపిక చేసుకోవాలని కొంతమంది మూవీ మేకర్స్ చూస్తున్నారు. దీంతో హీరోయిన్‌లకు ఒక రకంగా కాంపిటీషన్ పెరిగింది.  సినిమా చిన్నదైనా, పెద్దదైనా, పాన్ ఇండియా స్థాయిలో అయినా, కథా కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్స్‌కి వస్తున్నారు. ఎంత పెద్ద హీరో నటించిన సినిమా అయినా కథ బలహీనంగా ఉంటే అది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతోంది. ఇటీవలి కాలంలో విడుదలైన కొన్ని సినిమాలు దీనికి నిదర్శనం. అందుకే ఇప్పుడు హీరోల క్రేజ్ కంటే కథ, స్క్రీన్‌ప్లే, ప్రెజెంటేషన్ అనే అంశాలపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది.


ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అదేంటంటే – సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా కాన్సెప్ట్ రంగస్థలం తరహాలోనో, లేక పూర్తిగా వేరే కాన్సెప్ట్‌లోనో ఉండబోతోందో ఇంకా క్లారిటీ రాలేదు కానీ, ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. మొదట ఈ రోల్ కోసం సమంతను సంప్రదించారట. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. దీంతో ఇప్పుడు ఈ రోల్ కోసం కీర్తి సురేష్, జాన్వి కపూర్  ఇద్దరు హీరోయిన్స్ మధ్య పోటీ నడుస్తోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రస్తుతం ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనలైజ్ చేసే పనిలో మూవీ టీమ్ బిజీగా ఉన్నారట.



అయితే రామ్ చరణ్ మాత్రం జాన్వి కపూర్‌కి కొంచెం దూరంగా ఉన్నారని సమాచారం. కారణం ఏమిటంటే – ఇప్పటికే ఆయన జాన్వి కపూర్‌తో "పెద్ది" సినిమాలో స్క్రీన్ షేర్ చేస్తున్నారు. వెంటనే మరో సినిమాలో మళ్లీ ఆమెతో జతకడితే ప్రేక్షకులకు కొత్తదనం తగ్గిపోతుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ కోసం కీర్తి సురేష్‌ను ఫైనల్ చేయాలని సూచించారట. ఇక కీర్తి సురేష్ లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, త్వరలోనే సుకుమార్ ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంటున్నారు. మొత్తానికి ఈ కాంపిటీషన్‌లో ఎవరు విజేత అవుతారన్నది త్వరలోనే బయటపడనుంది..???

మరింత సమాచారం తెలుసుకోండి: