తెలుగు సినిమా అంటే ఒక పెద్ద కల. కానీ ఆ కల వెనక నడిచేది మాత్రం కోట్ల రూపాయల వ్యాపారమే. “సినిమా ఒక లాభసాటే వ్యాపారమైతే ఇవాళ మన ఇండస్ట్రీలో ఎవరూ ఉండే వాళ్ళు కాదు” అనేది నిజం. ఎందుకంటే, పక్కా బిజినెస్ లాజిక్‌ మీద నడిచే కార్పొరేట్లు, వడ్డీ వ్యాపారులు ఈ ఫీల్డ్‌కి ఎందుకు రాలేదు? వాళ్లకి లెక్కలూ తెలుసు, రిస్క్‌ కూడా తెలుసు. అందుకే సినిమాల మీద ప్రేమ చూపకపోవడమే. కానీ మన నాగవంశీ, దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా లాంటి వాళ్లకి మాత్రం ఇంకా జ్ఞానం రాలేదు. “మాకు సినిమాపై ప్యాషన్ ఉంది” అని ఒక డైలాగ్ చెబుతారు గానీ, వాస్తవానికి ఇది ఒక పేకాటలాంటిదే. ఎప్పుడు ఏ ముక్క పడుతుందో ఎవరికీ తెలీదు. జూలై 23 నుంచి ఆగస్టు 25 వరకూ వచ్చిన లెక్కలు చూస్తేనే షాక్ అవ్వాలి. ఒక్క నెలలోనే దాదాపు 225-250 కోట్ల నష్టం తెలుగు సినిమా చూసింది.


* హరి హర వీరమల్లు – 55-60 కోట్ల నష్టం. (ప్రొడ్యూసర్ ఏ.యం. రత్నం, డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్)

* కింగ్డమ్ – 25-30 కోట్ల నష్టం. (ప్రొడ్యూసర్ నాగవంశీ, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు)

* కూలి (తెలుగు వెర్షన్) – 10-15 కోట్ల నష్టం. (ప్రొడ్యూసర్ సన్ పిక్చర్స్, డిస్ట్రిబ్యూషన్ బై ఆసియన్ సునీల్దిల్ రాజు సిండికేట్)

* వార్ 2 – 55-60 కోట్ల నష్టం. (ప్రొడ్యూసర్ YRF, తెలుగు రిలీజ్ నాగవంశీ వయా దిల్ రాజు)

ఇవే కాకుండా ఇంకెన్నో సినిమాలు మౌనంగా ఫ్లాప్ అయ్యాయి. మొత్తంగా ఇండస్ట్రీ గణాంకాలు భయపెడుతున్నాయి.అయినా కూడా ఈ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బయటకు వచ్చి “సినిమా కళామతల్లి ముద్దుబిడ్డలం, మేము ఇండస్ట్రీలో 30 వేల ఉద్యోగాలు సృష్టించాం” అంటూ గొప్పలు చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి బడ్జెట్‌లో 60-65% మొత్తం హీరోలు, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్‌కి పోతుంటే, లాభం ఎలా వస్తుంది? ఇక మరో ఫ్యాక్ట్ ఏమిటంటే – చాలా మంది వెనకడుగేసినా కూడా, యూఎస్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు, పొలిటికల్ ట్రాన్సాక్షన్లు ఉన్నంత వరకూ ఈ దందా ఆగదు. తెలుగు సినిమా ఒక కల. కానీ ఆ కలను నమ్మి నష్టాలు మింగేవాళ్ళే మన నిర్మాతలు. ఇప్పుడు కళ్ళు తెరవకపోతే, వచ్చే రోజుల్లో ఇంకా ఘోరంగా కూలిపోవడమే తప్ప, రక్షణ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: