సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఫ్యామిలీ. నాగార్జున అక్కినేని తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా ఎంతో మంది అభిమాన హృదయాలను గెలుచుకున్నాడు. ఆయన పెద్ద కొడుకు నాగ చైతన్య, చిన్న కొడుకు అఖిల్ ఇద్దరూ టాలీవుడ్‌లో హీరోలుగా రాణిస్తున్నారు. తాజాగా అఖిల్ తన ప్రేయసి జైనబ్‌ను ప్రేమించి ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారి వివాహం చాలా ప్రైవేట్‌గా, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినప్పటికీ, ఆ వేడుక ఘనంగా సాగింది. పెళ్లి తర్వాత అఖిల్, జైనబ్ దంపతులు వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచుతూ, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించకుండా తమ వ్యక్తిగత జీవితం ఆనందంగా గడుపుతున్నారు.


అయితే, ఈ జంట పేరు ఒక్కసారిగా మళ్లీ హెడ్లైన్స్‌లోకి వచ్చింది. కారణం ఏంటంటే..అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిన్న కోడలు జైనబ్ షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన పోస్ట్. ఆ పోస్ట్‌లో జైనబ్ తన మామగారితో ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ, హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపింది. నిజానికి నిన్న చాలా మంది నాగ్ కి విషెస్ అందించారు. కానీ జైనబ్ పెట్టిన పోస్ట్ హైలెట్ మారి సోషల్ మీడియాని షేక్ చేసింది.  "హ్యాపీ బర్త్‌డే నాగార్జున గారు. మీరు మా జీవితాల్లో ప్రతి రోజూ ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. మీరు మా తండ్రిలా ఉండటం మా అదృష్టం. మీరు లాంటి మామగారు ఉండటం మాకు లక్కీ ఫీలింగ్ ఇస్తోంది." అంటూ పోస్ట్ షేర్ చేసింది. జైనబ్ రాసిన ఈ సందేశంలో ఎటువంటి తప్పుడు భావం లేకపోయినా, కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు దీన్నిని తప్పుగా అర్థం చేసుకున్నారు. "మామగారిని తండ్రిగా పిలవడం ఏమిటి?" అంటూ విమర్శలు చేస్తూ జైనబ్‌పై కామెంట్స్ పెట్టారు. ఈ విమర్శలు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.



దీనిపై నాగార్జున అభిమానులు మాత్రం జైనబ్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తూ, ఆమె చెప్పిన మాటల వెనుక ఉన్న పవిత్ర భావాన్ని వివరించారు. "చాలా ఇళ్లలో మామగారిని తండ్రిలా భావించడం సర్వసాధారణం. పెళ్లయిన ఆడపిల్లకు పుట్టింటి తండ్రి ప్రమ లోటును భర్త కుటుంబం తీర్చుతుంది. అందులో తప్పేం లేదు. జైనబ్ నాగార్జున గారిని నిజమైన ప్రేమతో, గౌరవంతో తండ్రిగా పిలిచింది. దీనిని తప్పుగా అర్థం చేసుకోవడం అవసరం లేదు" అని ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. జైనబ్ తన భావాలను స్వచ్ఛమైన ప్రేమతో పంచుకున్నప్పటికీ, కొందరు నెగెటివ్ కామెంట్స్ పెట్టడం, దానిపై అనవసర రాద్ధాంతం చేయడం వల్ల ఈ పోస్ట్ మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే అభిమానులు మాత్రం నాగార్జున మరియు జైనబ్ మధ్య ఉన్న బంధాన్ని ప్రశంసిస్తూ, జైనబ్‌ను ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.



అక్కినేని కుటుంబం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటినుంచో ఎంతో సన్నిహితంగా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు నుంచి ప్రారంభమైన ఈ సినీ వారసత్వం, నాగార్జున చేతుల్లో మరింత పటిష్ఠమైంది. ఇప్పుడు ఆయన పిల్లలు చైతన్య, అఖిల్ సినిమాల్లో రాణిస్తున్నారంటే అందరికీ గర్వకారణం. జైనబ్ లాంటి కొత్త కోడలు ఈ కుటుంబంలో కలిసిపోయి, అక్కినేని కుటుంబ బంధాన్ని మరింత బలపరుస్తున్నదనేది అభిమానుల అభిప్రాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: