టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన సమంత ఈమధ్య సినిమాలలో తక్కువగా నటిస్తున్నప్పటికీ రెండవ పెళ్లి విషయంలో రాజ్ నిడుమోర్ తో సమంత పేరు ట్రెండిగా మారుతోంది. మొదట అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోగా కొన్ని కారణాల చేత  విడాకులు తీసుకున్నారు. మయోసైటీస్ బారిన  పడ్డ సమంత తిరిగి కోలుకుంది. అప్పటినుంచి సమంత  పేరు ఎక్కువగానే వినిపిస్తోంది.. తన స్నేహితురాలు అయినా నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన "బేబీ" చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో గతంలో పాల్గొన్న సమంత అప్పుడు ఒక టీవీ షోలో ఇంటర్వ్యూ ఇచ్చింది.




ఆ షోలో సమంతకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది?. అదేమిటంటే టాలీవుడ్ , కోలీవుడ్ హీరోలలో ఏ హీరో అందంగా ఉంటారనే ప్రశ్న అడగగా అందుకు సమంత ఏమాత్రం ఆలోచించకుండానే టక్కున తన మామగారే అంటూ సమాధానాన్ని తెలియజేసింది.అయితే ఇదంతా 2019 బేబీ సినిమా ప్రమోషన్స్ లో జరిగిన సంఘటన ఇందుకు సంబంధించి ఈ వీడియోను ఇప్పుడు అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని సమంత అభిమానులు తెగ వైరల్ గా చేశారు .నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున విషయంలో సమంత పాజిటివ్ గానే స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాగార్జున తనని ఒక సొంత కూతుర్ల చూసుకునేవారని ఎన్నోసార్లు తెలియజేసింది.



ఈ వీడియో వల్లే సమంత మళ్ళీ ట్రెండీగా మారిపోయింది. గత కొంతకాలంగా సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోర్ తో డేటింగ్ చేస్తోందని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉండడంతో  సమంత టీమ్ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నప్పటికీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తెలుగులో కూడా సమంత ఈమధ్య పెద్దగా చిత్రాలలో కూడా కనిపించకపోవడంతో అభిమానులు నిరాశపడుతున్నారు. నిర్మాతగా "శుభం" సినిమాని నిర్మించి మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: