
అదే సమయంలో అఖండ 2 విషయానికి వస్తే – చాలా కాలం వరకు ఓటిటి డీల్ జరగలేదు. కానీ గత వారం క్లోజ్ డోర్స్‌లో భారీ రేట్‌తో డీల్ కుదిరిందట. నిర్మాతలు సంతోషంగా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు రిలీజ్ ఎప్పుడు అన్నది హాట్ టాపిక్. పండగ సీజన్‌లో పోటీ ఎక్కువగా ఉంటుందని, దాంతో డిసెంబర్ 5 డేట్‌కి మూడ్ ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఇక తమన్ విషయంలో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. అఖండ 2కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సింపుల్‌గా ఇవ్వలేనని, ఆ రేంజ్‌లో మ్యూజిక్ కంపోజ్ చేయడం తనకో యజ్ఞం లాంటిదని బాలయ్యకు చెప్పాడట. అంతేకాకుండా ఒకే రోజున ఓజీతో తలపడితే రెండు సినిమాల ఓపెనింగ్స్‌కి డ్యామేజ్ అవుతుందని, కాస్త గ్యాప్ ఇవ్వడం మంచిదని ప్రొడ్యూసర్లతో చర్చించి పోస్ట్‌పోన్‌కి సపోర్ట్ ఇచ్చాడట.
ఈ డిసిజన్ వర్కౌట్ అయినట్టే. ఇప్పుడు బోయపాటి శీను మరింత కంఫర్ట్‌గా పనిచేయడానికి టైమ్ దొరికింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనిపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నాడు. మరోవైపు సాంగ్స్ రిలీజ్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు. దసరా నుంచి ఒక్కొక్క పాటను రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేయాలని టీమ్ ఆలోచన. మరి మొత్తం మీద, బాలయ్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న “అఖండ 2” ఇప్పటికే బిజినెస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 150 కోట్ల థియేట్రికల్ డీల్తో బరిలోకి దిగబోతోందని టాక్. ఇక పవన్ కళ్యాణ్ “ఓజీ”కి సోలో రిలీజ్ అవకాశం రావడంతో భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ క్లాష్ తప్పించుకోవడం ఇద్దరికీ గుడ్ ఫర్ బిజినెస్ అనుకోవచ్చు.