
ఇక చరణ్‌కి ఇది కొత్త కాదు. ఆయన ఇప్పటికే konidela production company ద్వారా ప్రొడ్యూసర్‌గానూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాలు మాత్రమే కాదు.. ఇప్పుడు థియేటర్ బిజినెస్‌లో కూడా తన ఇంపాక్ట్ చూపించడానికి సెట్ అవుతున్నాడు. ఇదే నిజమైతే.. మెగా ఫ్యాన్స్‌కి డబుల్ దుమ్ము రేపే ఫెస్టివల్ మూడ్ ఖాయం. ఒకవైపు "RC16" లాంటి భారీ సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు బిజినెస్ ఎక్స్‌పాంషన్ కూడా చెయ్యటం అంటే చరణ్ విజన్ ఎంత క్లియర్‌గా ఉందో అర్థం అవుతుంది. ఇండస్ట్రీలోని బజ్ ప్రకారం, ARC Cinemasని ఓ వరల్డ్ క్లాస్ మల్టీప్లెక్స్ ఎక్స్‌పీరియెన్స్గా డిజైన్ చేయబోతున్నారు. సౌండ్, స్క్రీన్, లగ్జరీ సీటింగ్ అన్నీ టాప్ క్లాస్‌లో ఉంటాయని టాక్.
ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో “చరణ్ హీరోగానే కాదు.. బిజినెస్ మైండ్‌లో కూడా హై లెవెల్‌కి వెళ్ళిపోతున్నాడు” అంటూ ఫుల్ హంగామా చేస్తున్నారు. మరి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా స్టార్ హీరోలు ఇప్పటికే థియేటర్ బిజినెస్‌లో ట్రై చేశారు. ఇప్పుడు మెగా పవర్‌స్టార్ కూడా అదే రూట్‌లోకి వెళ్ళడం.. ఇది మాస్ ఫీలింగ్స్‌ను మాక్స్ లెవెల్‌కి తీసుకెళ్తోంది. అయితే ARC Cinemas ఎక్కడ మొదలవుతుందో.. ఎప్పుడు లాంచ్ అవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఒక్క వార్తే ఫ్యాన్స్‌కి జోష్ ఇస్తోంది. “రామ్‌చరణ్ తెరమీద మెగా హీరో.. తెరవెనుక మెగా బిజినెస్‌మెన్” అంటూ సోషల్ మీడియా ఫ్లడింగ్ అవుతోంది.