పవర్ స్టార్ పవన్ కళ్యాణ్–దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన అంచనాలు. ఈ పేర్లు వినగానే అందరికీ తొలుత గుర్తుకొచ్చేది గబ్బర్ సింగ్ సినిమా. ఆ సినిమాలోని పాటలు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకున్నాయి. ప్రత్యేకంగా "పిల్లా నువ్వు లేని జీవితం" పాట అప్పట్లో అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా చోటు దక్కించుకుంది. ఇప్పటికీ ఆ పాట విన్నప్పుడల్లా పవన్ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోతారు. ఇప్పుడు మళ్లీ అదే మ్యాజికల్ కాంబినేషన్ తెరపై అలరించబోతోంది. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్ పనిచేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ తరచూ ఈ చిత్రంలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతాయని చెబుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రత్యేక పోస్టర్‌కు కూడా అద్భుతమైన స్పందన లభించింది. మైకేల్ జాక్సన్ స్టైల్ లుక్‌లో పవన్ కనిపించడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు "పవన్ మళ్లీ డాన్స్ మూడ్‌లోకి వచ్చేశాడు" అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.
ఇక తాజాగా దేవిశ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైమా అవార్డ్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దేవి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఉన్న ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ,"ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ మీల్స్ అన్నట్లుంది. ఇటీవల పవన్ గారి మీద ఒక పాట షూట్ చేశాం. అది చాలా బాగా వచ్చింది. ఆ డాన్స్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌ను పండగ మూడ్‌లోకి తీసుకెళ్తుంది. షూటింగ్ ముగిసిన తర్వాత పవన్ గారు నన్ను చూసి – ‘అదరగొట్టేశావు దేవి! చాలా కాలం తర్వాత మళ్లీ డాన్స్ చేయాలన్న కోరిక కలిగించావు. నువ్వు నన్ను డాన్స్ చేయిస్తున్నావు దేవి’ అంటూ నవ్వేశారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు నిజంగానే గాల్లో తేలుతున్న భావన కలిగింది. ఈ సినిమాలో పవన్ గారి డాన్స్ చాలా పెద్ద హైలైట్ అవుతుంది." అని తెలిపారు.
దేవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హైలెట్ గా మారాయి. అభిమానులు "దేవి పాట విన్నాక పవన్ గారికి కూడా డాన్స్ చేయాలన్న మూడ్ వచ్చిందంటే... ఈసారి థియేటర్స్‌లో మాస్ ఫెస్ట్ గ్యారంటీ!" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అభిమానులు పవన్ కళ్యాణ్ నోట ఇలాంటి మాటలు రావడం నిజంగా అద్భుతమని, అదీ ఏపీ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న తర్వాత రావడం గొప్ప విషయమని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గబ్బర్ సింగ్ తరహా బ్లాక్‌బస్టర్ మ్యాజిక్‌ను మళ్లీ తెరపై చూపించబోతున్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, పవన్ కళ్యాణ్ మాస్ ఎనర్జీ, హరీష్ శంకర్ స్టైల్ కలిసిపోతే థియేటర్స్‌లో అరుపులు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అని పవన్ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు..!