
హనుమాన్ సినిమా విడుదలైన తర్వాత తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మీరాయ్ సినిమా విడుదల కాకముందే నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా రూ .45 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందట. దీంతో ఈ సినిమాకి రూ .20 కోట్ల రూపాయలు పైగా లాభం వచ్చినట్లుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నేటి సినిమా మార్కెట్లో ఇది చాలా గణనీయమైన విజయమని చెప్పవచ్చు. బడ స్టార్ హీరోల చిత్రాలకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ చిన్న హీరో అయినా తేజ సజ్జా సినిమా మీరాయ్ మాత్రం విడుదలకు ముందే మంచి లాభాలను అందించేలా చేస్తోంది.
మీరాయ్ సినిమా విడుదల చేసిన అన్ని భాషలలో కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. దీని తర్వాత నిర్మాతలు స్వయంగా ఈ సినిమాని అన్ని భాషలలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది కంటెంట్ పైన , తేజ సజ్జా నటన పైన వారికున్న బలమైన విశ్వాసాన్ని అందిస్తోందట. మీరాయ్ సినిమా అధిక బడ్జెట్ లేకపోయినప్పటికీ స్టార్స్ లేకపోయినప్పటికీ నాణ్యత గల సినిమాని నిర్మించవచ్చు అంటూ నిరూపించారు.
మీరాయ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.