సెలబ్రిటీల ఇల్లు ఎంత సువిశాలంగా ఎంత లగ్జరీగా ఉంటాయో చెప్పనక్కర్లేదు.స్టార్ సెలబ్రిటీల ఇంట్లోకి వెళ్తే అచ్చం ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే పదులకు మించి గదులు ఉండడంతో పాటు అన్ని చాలా లగ్జరీగా ఉంటాయి. ఇక కొంతమంది సెలబ్రిటీలు నష్టాల్లో ఉన్నప్పుడు తాము ఎంతో ప్రేమగా కొనుక్కున్న ఇళ్లను అమ్మేస్తూ ఉంటారు. మరి కొంత మంది ఖాళీగా ఉండడం ఎందుకు అని వేరే వాళ్లకు రెంటుకు ఇచ్చేస్తూ ఉంటారు.అయితే తాజాగా సౌత్ నటీనటులు భార్యాభర్తలు అయినటువంటి రాధిక శరత్ కుమార్ ఇద్దరూ తమ లగ్జరీ ఇల్లుని వదిలేసి 3BHK లో అద్దెకు దిగారట. మరి అంత పెద్ద ఇంటిని వదిలేసి అద్దెకి ఉండాల్సిన అవసరం ఈ జంటకు ఎందుకు వచ్చింది..ఎందుకు వీరికి అంత దుస్థితి ఎదురయ్యింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

రాధిక శరత్ కుమార్ ఇద్దరు తమ సొంత ఇంటిని వదిలేసి అద్దె ఇంట్లోకి రావడానికి ప్రధాన కారణం రాధిక వాళ్ళు ఉండే ఇంట్లో 15 మందికి పైగా పనివాళ్లు ఉంటారట. కానీ రాధిక మాత్రం చాలా ఒంటరిగా ఉంటుందట. ఎందుకంటే కూతుర్లకు పెళ్లిళ్లు అయిపోయాయి ఎవరి లైఫ్ లో వారు సెట్ అయిపోయారు. అలాగే కొడుకు విదేశాల్లో చదువుతున్నాడు. దాంతో ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఇద్దరు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారట. ఇక ఇంట్లో అంతమంది ఉన్నా కూడా రాధిక ఒంటరిగానే ఫీలవుతుందట.అంతే కాకుండా వాళ్ళ ఇంట్లో ఏకంగా 7 ద్వారాలుంటాయట. అయితే 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వీళ్ళ ఇంట్లో అంతమంది పని వాళ్ళు ఉన్నా కూడా ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు రాధికనే చూసుకుంటుందట.

రాత్రి అయితే చాలు ఆ ఏడు ద్వారాలకు గడియ పెట్టడానికి రాధిక ఎన్నో ఇబ్బందులు పడుతుందట. ముఖ్యంగా అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫీలింగ్ రాధిక కు రావడంతో ఆ ఇల్లు వదిలేసి 3 BHK ని రెంట్ కి తీసుకున్నారట. ఇక తమ సొంత ఇంటిని ఓ ఐటీ కంపెనీకి రెంట్ కి ఇచ్చేసి వాళ్ళు అలా అద్దె ఇంట్లో ఉంటున్నారట.అయితే ఈ విషయాన్ని స్వయంగా శరత్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇది కాస్త బయటపడింది. ఇక రాధిక రాజకీయాల్లో సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక శరత్ కుమార్ కూడా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.రీసెంట్గా ఆయన నటించిన 3 BHK మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే కన్నప్ప మూవీ లో మంచు విష్ణు తండ్రి పాత్రలో శరత్ కుమార్ నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: