
ఈ సినిమాలో తేజ సజ్జా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో తేజ డూప్ లేకుండా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడంతో పాటు మనోడి కామెడీ టైమింగ్ సినిమాకి బాగా వర్కౌట్ అయింది. అన్ని భాషల్లోనూ తేజ పర్ఫామెన్స్‌కు యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ దక్కుతున్నాయి. ఇక ఈ దెబ్బతో టైర్ 2 హీరోలలో తేజ సజ్జా టాప్ లీగ్‌లోకి వచ్చినట్లుగానే ట్రేడ్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్టు చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రియ జగపతిబాబు ఇతర కీలక పాత్రలలో నటించారు. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు