ఏంటి మోహన్ లాల్ ఆ నటి ఇంట్లో కృష్ణుడి విగ్రహాన్ని తీసుకువెళ్లారా..లక్షలు ఖరీదు చేసే కృష్ణుడి విగ్రహాన్ని మోహన్ లాల్ తన ఇంటికి ఎందుకు తీసుకువెళ్లారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విక్రమ్ నటించిన అపరిచితుడు మూవీలో విక్రమ్ తల్లి పాత్రలో నటించిన నటి శాంతి అంటే తెలుగువారికి ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ తమిళ మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సినిమాల్లో రాణించింది. శాంతి వందకు పైగా సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా రాణిస్తోంది.అయితే అలాంటి శాంతి మలయాళ ఇండస్ట్రీలో ఫేమస్ అయినటువంటి సినిమాటోగ్రాఫర్ జే విలియమ్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో మోహన్ లాల్  నిజ స్వరూపం గురించి చెబుతూ జే విలియమ్స్ తో పెళ్లయిన కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన అనారోగ్యంతో మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలోకి వచ్చారు.

 ఆ సమయంలో నా పిల్లల్ని పోషించుకోవడానికి ఎన్నో పనులు చేశాను. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుండి ఏ ఒక్కరు కూడా నాకు సహాయం అందించలేదు. ఇక మోహన్ లాల్ గురించి చెప్పుకుంటే ఆయన సూపర్ స్టార్ కాకముందు మా ఇంటికి వచ్చి చిన్నపిల్లాడిలాగే ఉండేవాడు. కానీ ఎప్పుడైతే హీరోగా ఎదిగారో అప్పటినుండి ఆయన తీరు మారిపోయింది. అలాగే మా ఆయన అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకున్నారు.. మా ఇంట్లో లక్షల ఖరీదు చేసే కృష్ణుడి విగ్రహం చాలా పెద్దది ఉండేది. ఇక ఆ సమయంలో మా ఇంటికి వచ్చిన మోహన్ లాల్ తో పిల్లలు ఎయిర్ కండిషనర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని నాకు మీ ఇంట్లో ఉన్న కృష్ణుడి విగ్రహం ఇచ్చేయండి నేను ఎయిర్ కండిషనర్ ఇస్తానని తన ఆఫీసులోని పాత ఎయిర్ కండిషనర్ ని మా ఇంటికి పంపించారు. దానికి బదులుగా లక్షల విలువ చేసే పది పన్నెండు అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని తన ఇంటికి తీసుకువెళ్లారు.ఇక ఆయన పంపించిన ఎయిర్ కండిషనర్ పది రోజుల్లోనే రిపేర్ కి వచ్చింది.

ఆ తర్వాత దాన్ని అమ్మేస్తే కనీసం 2000 కూడా రాలేదు.. అలా మోహన్లాల్ మా కష్టాలను ఆసరాగా చేసుకొని ఇంట్లో ఉన్న కృష్ణుడి బొమ్మ తీసుకెళ్లారు ఇక చిన్నప్పటి నుండి మోహన్లాల్ కి ఎన్నో చేసినా నా భర్త చనిపోయిన సమయంలో కనీసం మోహన్లాల్ చివరి చూపు చూడ్డానికి కూడా రాలేదు.అలాగే మలయాళ ఇండస్ట్రీలో నేను ఉన్నందుకు సిగ్గు పడుతున్నాను. ఎందుకంటే నా భర్త చనిపోయినప్పుడు మలయాళ ఇండస్ట్రీ నుండి ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదు. తమిళ డైరెక్టర్ శంకర్ గారు నాకు 25వేల సహాయం చేసి ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పారు.అలాగే తమిళ ఇండస్ట్రీ నుండి మరికొంతమంది నాకు డబ్బు సహాయం చేశారు. నా పిల్లలు తిండి లేక చాలాసార్లు ఆకలితోనే పడుకున్నారు. ప్రస్తుతం పిల్లల పెద్దవాల్లయ్యి లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఉద్యోగాలు చేస్తున్నారు అంటూ శాంతి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: