
"జూనియర్ ఎన్టీఆర్‌కు ఏమైంది? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అసలు ప్రమాదం ఎలా జరిగింది?" అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పందిస్తూ – "ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. కొన్ని టెస్టులు చేసి, సరైన మెడిసిన్ ఇచ్చి, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు" అని స్పష్టం చేసింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే, అందరి మైండ్‌లోకి 2009 మార్చి 26 రాత్రి (అర్ధరాత్రి మార్చి 27) జరిగిన ప్రమాదం గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్‌కి తిరిగి వస్తూ ఉండగా, సూర్యాపేట వద్ద ఆయన కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టి, ఆపై చెట్టును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఎన్టీఆర్ మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
నల్గొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన ఆ యాక్సిడెంట్ అప్పట్లో అభిమానులను బాగా కలిచివేసింది. ఎన్టీఆర్ కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. ఇప్పుడు మళ్లీ ఆయనకు ప్రమాదం జరిగిందని తెలిసి, అందరికీ అదే సంఘటన గుర్తొచ్చింది. కొయిన్సిడేన్స్ ఏమిటంటే – ఆ ప్రమాదం కూడా శుక్రవారం రోజు (గురువారం అర్ధరాత్రి అయినా శుక్రవారం కిందే పరిగణిస్తారు) జరిగింది. ఇప్పుడు ఈ ప్రమాదం కూడా శుక్రవారం జరగడంతో, సోషల్ మీడియాలో ఇది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. కొంతమంది – "శుక్రవారం ఎన్టీఆర్‌కు కలిసిరావడం లేదు. ఆయన జాతకంలో ఏదో దోషం ఉందేమో..? పూజలు చేయించుకుంటే మంచిది" అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం – "అయన పూర్తిగా రెస్ట్ తీసుకొని, ఆరోగ్యవంతుడిగా తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలి" అని కోరుకుంటున్నారు.