
అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రామ్ చరణ్ దగ్గర కూడా కనిపిస్తోందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ కూడా మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నాడట. దానికి ప్రధాన కారణం, లావణ్య త్రిపాఠి ఇటీవల మగ బిడ్డకు జన్మనివ్వడమే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీపై మళ్లీ సోషల్ మీడియాలో బోలెడన్ని చర్చలు మొదలయ్యాయి.
ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్, “రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు మగ బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డ చిరంజీవి గారి వారసత్వానికి వారసుడవుతాడు. ఆయన మెగా ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తాడు” అంటూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. కొన్నిసార్లు ఇది అభిమానుల మధ్యలోనే కాదు, మీడియాలో కూడా పెద్ద డిబేట్‌గా మారింది. కానీ ప్రతిసారి ఉపాసన, రామ్ చరణ్ మాత్రం ఒకే మాట చెబుతున్నారు – “ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం, ఎవరికీ సంబంధం లేదు” అని క్లారిటీ ఇస్తూనే వచ్చారు.ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఒక మగ బిడ్డకు జన్మనివ్వడంతో, మళ్లీ ఉపాసన రెండో ప్రెగ్నెన్సీ గురించి గాసిప్స్ వేడెక్కుతున్నాయి. “ఎప్పుడు రెండో బిడ్డ ప్లాన్ చేస్తారు? ఎప్పుడు మెగా వారసుడు వస్తాడు?” అంటూ సోషల్ మీడియాలో, మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అయితే మీడియా ముందు రామ్ చరణ్ కనిపిస్తే తప్పకుండా ఈ ప్రశ్నే అడుగుతారని గట్టిగా అంటున్నారు. అందుకే రామ్ చరణ్ ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి భయపడిపోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు, పెద్ద సినిమాల ప్రమోషన్స్‌కే హాజరు కావడానికి కూడా ఆయన కొంచెం వెనుకంజ వేస్తున్నారని సమాచారం. ఎందుకంటే ఎక్కడికెళ్లినా అభిమానులు, మీడియా ఒకటే ప్రశ్న వేస్తారని “ఎప్పుడు రెండో బిడ్డ? రెండో ప్రెగ్నెన్సీ ఎప్పుడూ?” అంటూ ప్రశ్నలు వస్తాయ్ అని భయపడుతున్నాడట. మా ఫ్యామిలీ విషయాల్లో ఇలా తలదూర్చడం ఎందుకని రామ్ చరణ్, ఉపాసన చాలా బాధపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఇక సోషల్ మీడియాలో కూడా రామ్ చరణ్ చాలా హర్ట్ అయ్యాడని కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. మెగా ఫ్యామిలీ ప్రైవేట్ లైఫ్‌ని గౌరవించడం అందరి బాధ్యత అని సినీ ప్రముఖులు కూడా చెబుతున్నారు. అభిమానులు ఈ విషయాన్ని వదిలేస్తేనే బెటర్ అని, వాళ్ల ప్రైవసీకి గౌరవం ఇవ్వడం అవసరమని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.