
ఇక “గేమ్ ఛేంజర్” గురించి చెప్పనక్కర్లేదు – తమన్ ఎంత కష్టపడ్డా కంటెంట్ బలహీనత వల్ల అది డిజాస్టర్ ఖాతాలో పడింది. ఇలా వరుసగా ఆప్షన్స్ ఫ్లాప్ కావడంతో మ్యూజిక్ లవర్స్ ఒక పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు సమాధానం లాంటి ప్రాజెక్ట్‌గా “ఓజీ” నిలుస్తుందని ఇప్పుడు టాక్. జపాన్ ఫ్లేవర్‌లో కంపోజ్ చేసిన పాటలు, టీజర్ బీజీఎమ్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. యూనిట్ వర్గాల ప్రకారం.. తమన్ ఈసారి పవన్ కోసం డబుల్ డ్యూటీ చేశాడట. ముఖ్యంగా సెకండాఫ్‌లో చివరి 45 నిమిషాలు పూర్తిగా బీజీఎమ్ ఆధిపత్యంలోనే సాగుతాయట. సుజీత్ విజన్‌కి తగ్గట్టుగా పవన్ ఎలివేషన్స్‌ను తమన్ ట్యూన్స్ మాస్ లెవెల్లోకి తీసుకెళ్లాయని వినిపిస్తోంది. ఇదే కాకుండా రాబోయే నెలల్లో తమన్ డామినేషన్ కనిపించనుంది. సిద్ధూ జొన్నలగడ్డ “తెలుసు కదా” లోని పాటలు ఇప్పటికే యూత్‌ని ఆకట్టుకున్నాయి.
ఆ ఆల్బమ్ చార్ట్‌బస్టర్ అవుతుందని టీమ్ ధీమాగా ఉంది. మరోవైపు “అఖండ 2” పై ఉన్న అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్‌కే పైసా వసూల్ అనిపించేలా కంపోజ్ చేశానని తమన్ స్వయంగా చెబుతున్నాడు. ఇక 2025 జనవరిలో రిలీజ్ కానున్న “ది రాజా సాబ్” తో తమన్ పనితనం మరో లెవెల్‌కి వెళ్తుందని దర్శకుడు మారుతీ ఇప్పటికే హింట్ ఇచ్చాడు. అదే కాకుండా తమిళ్ మూవీ “ఇదయం మురళి” కూడా త్వరలోనే రాబోతోంది. మొత్తానికి.. వరుస సగటు సినిమాల తర్వాత “ఓజీ” తో తమన్ పునరాగమనం ఖాయం. రాబోయే మూడు నాలుగు నెలలు పూర్తిగా తమన్ మ్యూజిక్ స్టార్మ్ నిండిపోనుంది. ఈసారి అతని పునరాగమనం కాదు.. “తమన్ వైభవం” అనేలా నిలవబోతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.