పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా రకరకాలుగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ కనిపించారు. కొందరు స్టార్ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ లుక్‌ను ఫాలో అవుతూ గడ్డం గీసుకున్నారు, మరికొందరు ఓజీకి సంబంధించిన టాటూలు వేయించుకొని సోషల్ మీడియాలో హంగామా చేశారు. మొత్తానికి అందరూ కూడా తమదైన స్టైల్లో సినిమాను ప్రమోట్ చేసినా, ఎక్కువగా హద్దులు దాటకుండా, పరిమితుల్లోనే అభిమానాన్ని వ్యక్తపరిచారు.


అయితే, ఈ అందరి కంటే భిన్నంగా ప్రమోషన్ చేయడానికి ప్రయత్నించింది బుల్లి  తెర ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న జగతి ఆంటీ. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తూ, పలు వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో తరచూ తన హాట్ అండ్ గ్లామరస్ ఫొటోలతో యువతను ఆకర్షిస్తూ ఉండే జగతి ఆంటీ, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు సంబంధించి కూడా అదే తరహా స్టెప్ వేసింది.సినిమా విడుదలకు ముందు నుండి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు అందరూ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతుండగా, నటి జ్యోతి (జగతి ఆంటీగా పాపులర్) మాత్రం కొంచెం డిఫరెంట్ స్టైల్ ఎంచుకుంది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఆమె తన లోదుస్తుల మీదనే “ఓఘ్” అని ప్రింట్ చేయించుకొని, బోల్డ్‌గా, హాట్ లుక్‌లో ఫోజులిస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.



ఆ ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ ఫోటోలు చూసి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి ప్రమోషన్‌లు మాకు అవసరం లేదు… ఎవరు నిన్ను ఇలా చేయమన్నారు? అభిమానాన్ని వ్యక్తపరచడానికి ఇంత దిగజారిపోవాలా?” అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా, “భారతీయ మహిళ అంటే సంప్రదాయాలు, సంస్కృతి గుర్తుకు రావాలి. కానీ నువ్వు వేసుకున్న ఈ బట్టలు మహిళా లోకాన్నే కించపరుస్తున్నాయి” అంటూ మహిళలు కూడా ఆగ్రహంగా స్పందిస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కోసం అభిమానాన్ని చూపించడమే మంచిదే, కానీ ఆ అభిమానం కూడా ఒక మేరలో ఉండాలి అని చాలా మంది చెబుతున్నారు. అభిమానాన్ని చాటుకోవడంలో సృజనాత్మకత ఉండవచ్చు, కొత్తగా ఆలోచించవచ్చు, కానీ సమాజం ముందు మహిళగా మర్యాదలు మరిచి ఇలా హద్దులు దాటితే అది అభిమానమే కాదు, వేరే కోణంలో విమర్శలకే కారణం అవుతుంది అని సోషల్ మీడియాలో ఘాటుగాటుగా రియాక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో జగతిని సపోర్ట్ చేసిన కొందరిపై కూడా జనాలు విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సిగ్గు లేదా? సినిమా ప్రమోషన్ కోసం ఇంత దూరం వెళ్లాలా?  అంటూ మరీ ఘాటుగా స్పందిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: