గత రెండు మూడు రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో ధర్మ మహేష్, రీతూ చౌదరి గురించే ఎక్కువగా వినిపించింది. ధర్మ మహేష్ భార్య గౌతమి వీరిద్దరి గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. రీతూ చౌదరి అర్ధరాత్రి తన భర్త ఫ్లాట్లోకి వెళ్తూ ఉంటుందంటూ కొన్ని వీడియోలను కూడా లీక్ చేసింది. అయితే ఈ విషయాలపైన గౌతమి భర్త ధర్మ మహేష్, రీతూ చౌదరితో తనకు ఎలాంటి సంబంధం లేదని కేవలం స్నేహితులు మాత్రమే అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాకుండా ధర్మ మహేష్ తండ్రి కూడా గౌతమికి పెళ్లి కాకముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నారంటూ మాట్లాడారు. ఈ విషయం మరింత వైరల్ గా మారింది.


ఇప్పుడు తాజాగా గౌతమి తన తండ్రితో కలిసి ఒక ఇంటర్వ్యూ చానల్లో మాట్లాడుతూ తనపైన చాలానే నిందలు వేశారు! తాను కోట్లు అడిగానని  మాట్లాడుతున్నారు అందులో ఎలాంటి నిజము లేదు నాకు ఉన్నది చాలు, వాళ్ళ డబ్బు నాకు అవసరం లేదు నాకు పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నారంటూ చెప్పిన మాట వాస్తవమే పెళ్లి అయిన తర్వాత ఉంటే తప్పు కానీ, పెళ్లి కాకముందు ఉంటే తప్పేమీ కాదు అంటూ తెలియజేసింది.. ఒకవేళ రేపు ధర్మతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ ఉండవచ్చు అంటూ తెలిపింది గౌతమి.



మన చట్టాలు కూడా కేవలం ఒకరితో మాత్రమే ఉండమని చెప్పాయి.. మీ అబ్బాయి ఉన్నప్పుడే నేను వేరే వాళ్ళతో తిరగలేదు కదా? రేపు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకుంటానేమో ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్ళే నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు. కానీ నేను ఎవరిని మోసం చేయలేదు ,నిజాయితీగా ఉన్నాను నాకు విడాకులు ఇచ్చేవరకు నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటూ తెలియజేసింది గౌతమి. అంతేకాకుండా రీతూ చౌదరి, తన భర్త ధర్మ సంబంధించి బెడ్ రూమ్ వీడియోస్ కూడా ఉన్నాయని చెప్పడంతో మరింత సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: