పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ ను రాబట్టింది. అలాగే ఈ సినిమా ప్రస్తుతం కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది.

ఈ మూడు రోజుల్లోనే ఈ సినిమా అదిరిపోయే రైర్ మార్క్ కలెక్షన్లను టచ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ మూడు రోజుల్లో అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నాను.

మరి ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా ... సుజిత్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ మూవీలో విలన్ పాత్రలో నటించగా డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. అర్జున్ దాస్ , శ్రేయ రెడ్డి , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: