పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత పవన్ చాలా సినిమాల్లో నటించాడు. కానీ పవన్ ఎక్కువ శాతం రీమిక్ సినిమాల్లో నటించాడు. దానితో అందులో కొన్ని సినిమాలు పరవాలేదు అనే స్థాయి విజయాలను అందుకున్న కూడా పవన్ రీమిక్ సినిమాలలో కాకుండా కొత్త కథతో రూపొందే సినిమాలో హీరో గా నటిస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా అభిప్రాయ పడిన సందర్భాలు ఉన్నాయి.

అలాంటి సందర్భం లోనే ఆయన హరిహర వీరమల్లు అనే సినిమాలో నటించాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తాజాగా ఈయన కొత్త కథతో ఓజి అనే సినిమా లో హీరో గా నటించాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి సుజిత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. 

ముఖ్యంగా ఈ సినిమా నార్త్ అమెరికాలో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 4.8 మిలియన్ ప్లస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: