సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన మూవీ లో మరొకరు హీరో గా నటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి బాలకృష్ణ , వెంకటేష్ రిజక్ట్ చేసిన ఓ సినిమాలో రవితేజ హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకు ఆ సినిమా ఏది ..? ఎందుకు బాలకృష్ణ ... వెంకటేష్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారు ..? అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... సముద్ర ఖనిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో నెగిటివ్ షెడ్స్ పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా గోపీచంద్ మలినేని, రవితేజ ను హీరో గా అనుకోలేదట. మొదట ఈ మూవీ కథ తయారు అయిన తర్వాత దీనిని గోపీచంద్ మలినేని , బాలకృష్ణ కు వినిపించాడట. కానీ బాలకృష్ణ కొన్ని కారణాల వల్ల ఈ కథలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దానితో గోపీచంద్ మలినేని ఇదే స్టోరీ ని వెంకటేష్ కి వినిపించాడట. కథ మొత్తం విన్న వెంకటేష్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ కథను రిజెక్ట్ చేశాడట. దానితో గోపీచంద్ మలినేని ఇదే కథను రవితేజ కు వినిపించాడట. ఇక రవితేజ కు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇలా బాలకృష్ణ , వెంకటేష్ ఇద్దరూ రిజెక్ట్ చేసిన స్టోరీ లో రవితేజ హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt