
మైత్రీ సంస్థ మౌళికి కోటి రూపాయల పారితోషికం ఫిక్స్ చేసి, అగ్రిమెంట్ చేయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేవలం అడ్వాన్స్ ఇచ్చి మౌళిని తమ ప్రాజెక్ట్‌కు ఖరారు చేశారు తప్ప, దర్శకుడు ఎవరో, కథాంశం ఏమిటో ఇంకా నిర్ణయించలేదు. తొలి సినిమా 'లిటిల్ హార్ట్స్'కు మౌళి రూ.5 నుంచి రూ.10 లక్షల మధ్య పారితోషికం అందుకుంటే, రెండో సినిమాకే కోటి మార్క్‌ను అందుకోవడం అతని మార్కెట్ వాల్యూను స్పష్టం చేస్తోంది. మైత్రీ ఒక్కటే కాదు, పరిశ్రమలో ఉన్న చాలామంది పెద్ద నిర్మాతలు మౌళితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మౌళి సైతం ఇండస్ట్రీలోని ముఖ్యమైన నిర్మాణ సంస్థల చుట్టూ చక్కర్లు కొట్టాడు. అందులో భాగంగా, కొన్ని సంస్థలు అతనికి అడ్వాన్సులు కూడా ఇచ్చాయి.
వాటిలో మైత్రీ ఇచ్చిన మొత్తమే పెద్దదిగా ఉంది. మైత్రీ కోటి రూపాయలు ఫిక్స్ చేసింది కాబట్టి, ఇకపై మౌళి పారితోషికం ఆ రేంజ్‌లోనే కొనసాగే అవకాశం ఉంది. 'లిటిల్ హార్ట్స్' తర్వాత మౌళి చేయబోయే తదుపరి సినిమా ఏమిటన్నది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఒకవేళ మైత్రీ మూవీస్ గనుక ఓ పేరున్న దర్శకుడిని రంగంలోకి దించి, క్రేజీ కాంబోను సెట్ చేస్తే, మౌళి రెండో సినిమా మైత్రీ బ్యానర్‌లోనే ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి, ఒక చిన్న సినిమా విజయం మౌళి కెరీర్‌ను రాత్రికి రాత్రే అగ్ర హీరోల పారితోషికం స్థాయికి చేర్చింది.