కోలీవుడ్లో హీరోగా పేరు సంపాదించిన ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన యాక్టింగ్ ఎంతో మంది అభిమానులు సంపాదించి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. తాజాగా మమత బైజు, ప్రదీప్ రంగనాథన్, నేహా శెట్టి కాంబినేషన్లో వస్తున్న చిత్రం డ్యూడ్ . ఈ చిత్రం అక్టోబర్ 17వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ట్రైలర్ ని కూడా విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దీంతో చిత్ర బృందం పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.


తాజాగా హీరోయిన్ మమతా బైజు ప్రదీప్ రంగనాథన్ గురించి మాట్లాడుతూ ప్రదీప్  పెద్ద కేడి అంటూ బాంబు పేల్చింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రదీప్ రంగనాథన్ చూడడానికి చాలా సాఫ్ట్ గా సైలెంట్ గా కనిపిస్తారని ,  పెద్ద కేడి లాగా ఆలోచిస్తారని, అతడు భయంకరమైన వ్యక్తి అంటు  ఫన్నీగా తెలియజేసింది. మొదటిసారిగా ప్రదీప్ రంగనాథన్ కి జోడిగా నటిస్తోంది మమత బైజు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.


ప్రదీప్ కి తెలుగులో కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. మొదటిసారిగా లవ్ టుడే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత డ్రాగన్ చిత్రంతో మరొకసారి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు డ్యూడ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి సినిమాలతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు చిత్రాలను ఒకేరోజు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను ఏ చిత్రంతో మెప్పిస్తారో చూడాలి మరి ప్రదీప్ రంగనాథన్. మమత బైజు విషయానికి వస్తే.. 2017లో మొదటిసారిగా మలయాళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించిన 2024 లో వచ్చిన ప్రేమలు డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది. ప్రస్తుతం జననాయగన్, సూర్య 46వ సినిమాతో పాటుగా మలయాళంలో మరో రెండు చిత్రాలలో నటించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: