తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతోంది. అలాంటి ఈ సమయంలో  ఇప్పటికే కంటోన్మెంట్ లో ఒక ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత మరో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలవాలని అన్ని పార్టీలు సర్వశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి ఈ సమయంలో  కొన్ని సర్వేలు నిర్వహించారు.. మరి ఆ సర్వేల ప్రకారం ఏ పార్టీకి ఎంత శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.. 

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ తరఫున మాగంటి సునిత పోటీలో ఉన్నారు. అయితే ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి జీవన్మరణ పోరాటమని చెప్పవచ్చు. ఇందులో గెలిస్తే ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కు పాజిటివ్ వైబ్ వచ్చి రాబోవు రోజుల్లో మంచి పట్టు మీద ఉంటుంది. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాదులో మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ ఉంది. వీళ్ళు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.  ఇదే క్రమంలో ఇంటిలిజెన్స్ సర్వేల్లో కూడా  కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉన్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ కు కలిసి వచ్చే నాయకుడు. బీసీ వ్యక్తి కావడం మరియు లోకల్ అనే నినాదం గట్టిగా ప్రజల్లో వినబడడం, ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడం నవీన్ యాదవ్ కు కలిసి వస్తుందట. బీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే 8 శాతం కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నట్టు కొన్ని సర్వేలు తేల్చేస్తున్నాయి. ఇక బీజేపీకి ఇక్కడ అంత ఓటు బ్యాంకు లేదు.. అలా ఎటు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ గెలుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి సర్వేలలో వచ్చిన ఫలితం ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: