టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రయోగాలకు పెట్టింది పేరు. విభిన్నమైన కథలతో నిరంతరం ప్రేక్షకులను అల్లరిస్తూ ఉంటారు.అలా ఎన్నో సినిమాల లో అలరించిన సుధీర్ బాబు హిట్, ప్లాపు సంబంధం లేకుండా సినిమాలను చేస్తూ ఉంటారు. తాజాగా జటాధర అనే చిత్రం లో నటించారు.ఈ చిత్రాన్ని వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగు ,హిందీ బైలింగ్వల్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇందులో కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాతోనే మొదటిసారి టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అయింది.


సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సందర్భంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ మొత్తం ధనం, దెయ్యాలు వంటి మైథాలాజికల్ ,సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. జటాధర  చిత్రంలో సోనాక్షి చాలా శక్తివంతమైన పాత్ర చేసినట్లుగా కనిపిస్తోంది. అలాగే రైన్ అంజలి, శిల్పా  శిరోద్కర్  కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. సుధీర్ బాబు ఇందులో దెయ్యాల మీద ఇన్వెస్టిగేషన్  చేసే ఆఫీసర్గా కనిపించబోతున్నట్లు ట్రైలర్లో చూపించారు. చివరి లో సోనాక్షి, సుధీర్ బాబు మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. జి స్టూడియో బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది.



మరి ఈ సూపర్ నాచురల్ కథాంశంతో వస్తున్న జటాధర సినిమా తో సుధీర్ బాబు ఈసారైనా సక్సెస్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ట్రైలర్ అయితే అందరిని ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. సుధీర్ బాబు చివరిసారిగా మా నాన్న సూపర్ హీరో అనే సినిమాలో కనిపించారు ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. అలాగే మాయదారి మల్లిగాడు అనే సినిమాలో కూడా నటిస్తున్నారు సుదీర్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: