వైజాగ్‌లో జరిగిన అఖండ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి. ‘ అఖండ 2 ' కేవలం తెలుగు సినిమా కాదు… దేశం మొత్తం చూడాల్సిన సినిమా అని స్పష్టంగా చెప్పారు. ఈ మాటలతోనే బాలయ్య ఈ సినిమాపై ఎలాంటి నమ్మకంతో ఉన్నారో అర్థమవుతుంది. “అఖండ మొదటి భాగం కరోనా పాండమిక్ సమయంలో విడుదలైన తొలి భారతీయ సినిమా... ఆ సమయంలో జనం థియేటర్లకు వస్తారా ? సినిమాలు తిరిగి నడుస్తాయా ? అన్న అనిశ్చితి నెలకొంది. అలాంటి సమయంలో అఖండ విడుదలై ఘనవిజయం సాధించింది. సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు మళ్లీ ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అఖండ తాండవం తో మీ ముందుకు వస్తున్నాని తెలిపారు.
‘ అఖండ 2 ’ కేవలం తెలుగు ప్రేక్షకులకే కాదు… దేశం మొత్తానికి సంబంధించిన సినిమా. అందుకే పాన్ ఇండియా ప్రమోషన్స్‌ను ముంబై నుంచి స్టార్ట్ చేశాం. ఈరోజు వైజాగ్, రేపు కర్ణాటక, ఆ తర్వాత చెన్నై ప్రతి చోటా సందడి చేయబోతున్నాం. సత్యం కోసం పోరాడండి, ధర్మంగా జీవించండి, అన్యాయానికి ఎదురు నిలబడండి అని మన సనాతన హైందవ ధర్మం చెబుతోంది. ఆ ధర్మం యొక్క శక్తి, గౌరవం, పరాక్రమం ఏమిటో ఈ సినిమాలో కనిపిస్తుంది ” అని బాలయ్య తెలిపారు. బాలయ్య మాటల్లో కనిపించిన ధైర్యం, విశ్వాసం చూస్తే అఖండ 2 ప్రమోషన్స్‌పై ఆయన ఎంత ప్రత్యేక శ్రద్ధ పెట్టుతున్నారో స్పష్టమవుతోంది. ఈసారి సినిమాకు దేశవ్యాప్తమైన గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు.
ఇప్పటికే ముంబైలో ఒక పాటను రిలీజ్ చేసిన బాలయ్య, తాజాగా విశాఖపట్నంలో మరో పాటను లాంచ్ చేశారు. ఇక హైదరాబాదులో త్వరలోనే భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. అది కూడా పబ్లిక్ ఈవెంట్‌నే. ఆ తర్వాత గ్రాండ్ ప్రీ - రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్‌లో ఉంది. ఇంతటితో కాదు… ఈసారి బాలయ్య ప్రింట్, వెబ్ మీడియా ఇంటర్వ్యూలను కూడా వ్యక్తిగతంగా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పాన్ ఇండియా టార్గెట్‌తో వస్తుండడంతో బాలయ్య మాటలు, ప్రమోషన్ల జోష్ చూస్తుంటే అఖండ 2 దేశవ్యాప్తంగా భారీ హంగామా చేయడానికి సిద్ధమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి