నటీనటులు: విక్రాంత్ (తొలి పరిచయం), మెహ్రీన్ పిర్జాదా, రుక్సర్ దిల్లాన్,నాజర్, సుహాసిని మణిరత్నం,వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యాంగర్, చమ్మక్ చంద్ర,అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర తదితరులు
సాంకేతిక నిపుణులుః
రచన, కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత: విక్రాంత్
మ్యూజిక్: హేషమ్ అబ్దుల్ వహబ్
సినిమాటోగ్రఫి: ఏఆర్ అశోక్ కుమార్
ఎఢిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: ఎస్ రాం ప్రసాద్
స్టంట్స్: జాగ్వర్ కృష్ణన్
రిలీజ్ డేట్: 2023-11-17
రేటింగ్‌: 3/5

హీరో విక్రాంత్‌ (జైదీప్‌) తన కాలేజీలో తనతో పాటు చదివే అనన్య (రుక్సర్‌ ధిల్లాన్‌) అనే అమ్మాయిని ఇష్టపడతారు. ఆమెను వివాహం చేసుకుని ఇద్దరూ కలిసి ఉండాలని ఎన్నో కలలు కంటారు. ఇంతలో అనుకోకుండా అనుమానాస్పదందా మరణాలు జరుగుతుంటాయి. ఆరాధన (అషురెడ్డి), మమత, హర్షిత (లహరి షారి), ఇంకా కొందరు ఎలా మరణించారో కూడా తెలియకుండా విచిత్రంగా మరణిస్తారు. ఆ మరణాలు ఎలా జరిగాయి దాన్ని ఎలా ఆపాలన్న ఆవేదనలో హీరో ఉంటాడు. ఈ వలలో హీరోయిన్‌ మెహ్రీన్‌ (లేఖ) ఎలా చిక్కుకుంటుంది. హీరో లేఖను ఎలా కాపాడతాడు  ఆమె ప్రేమలో ఎలా పడతాడు అన్న పంధాలో కథ సాగుతుంది.

ఒక్కో సిటీలో టీనేజ్‌ అమ్మాయిలు ఎలా మిస్‌ అవుతున్నారు. దీని వెనుక కారణలు ఎవరు ఏంటి అన్నది హీరో వెతుకుతూ ఉంటారు.  రుద్ర(గురుసోమసుందరం) అనే  సైనిక అధికారి ప్రారంభించిన స్పార్క్ ప్రాజెక్ట్  ఏంటి దాని వల్ల జరిగే ప్రమాదాలేంటి? నోబెల్ పురస్కార గ్రహీత, డాక్టర్ (సుహాసిని) స్పార్క్ ప్రాజెక్టులో ఎలా ఇన్‌వాల్వ్‌ అవుతుంది. దాని వెనుక ఉన్న అక్రమాలు ఉంటి ఎలాంటి స్కామ్‌లు జరుగుతున్నాయి ఇవన్నీ హీరో జైదీప్‌ వెలికితీస్తాడు.

ఒక సినీ నటి పేరు ఆరాధన అనే అమ్మాయి తన తల్లిదండ్రులను చంపి తాను కూడా చనిపోవడంతో కథ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. కథలో ఎంతో అద్భుతమైన అంశాన్ని దర్శకుడు తెర మీద ఎంతో అద్భుతంగా తీసుకువచ్చారు. ఎక్కడా కూడా తడబాటు పడకుండా తెరకెక్కించిన తీరు వర్ణణాతీతం. ఎంతో మంది స్టార్‌ క్యాస్టింగ్‌ ఈ చిత్రంలో నటించారు. అందరికీ కూడా అద్భుతంగా నటించి అవకాశం ఉన్న పాత్రలు. ఇక కథలో ఉండే ట్విస్టులు ఎవ్వరూ కూడా ఊహించలేనంతలా ఉంటాయి. ఎంతో బలమైన కథ అని చెప్పవచ్చు. ఓవరాల్‌గా ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది.

ఈ చిత్రంలో నటించిన నటీనటుల విషయానికి వస్తే ఎవరికి వారే అద్భుతమైన నటనతో వారి వారి పాత్రలకు న్యాయం చేశారనిపించింది. హీరో విక్రాంత్‌ తొలి పరిచయం అయినప్పటికీ చాలా బాగా నటించారు. అనుభవం ఉన్న హీరోలాగా సినిమా మొత్తాన్ని తన భుజ స్కంధాలపై తీసుకువెళ్ళినట్లు అనిపించింది. ఇక డ్యాన్స్‌లు కూడా చాలా బాగా కొత్త కొత్త స్టెప్పులు చేశాడు. అదే విధంగా ఫైట్లు కూడా ఎంతో అద్భుతంగా చేశాడు.  హీరోగా బలమైన, భారమైన పాత్రతో తెర మీదకు రావడం సినిమాపై ఆయనకు ఉన్న తపన తెలియజేసింది. ఇక  హీరోయిన్‌ మెహ్రీన్ కూడా ఎంతో అందమైన  గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. సన్నపడ్డా ఎంతో అందంగా ఉంది. రుక్సర్ పాత్ర కూడా దర్శకుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. రుద్రగా విలన్‌పాత్రలో నటించిన అసలైన కీలక పాత్ర సుహాసిని ఎంతో చక్కగా ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, సత్య కామెడీ బాగానే వర్క్‌ అవుట్‌ అయింది.

స్పార్క్ చిత్రంలో స్క్రిప్ట్ పరంగా, ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ విషయంలో చిన్న చిన్న లోపాలు కనిపించినప్పటికీ టెక్నికల్‌గా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ విభాగాలు పనితీరు చెప్పలేనంతగా కుదిరాయి. అందమైన లోకేషన్లలో పాటలు అదుభ్తంగా చిత్రీకరించారు. హేషమ్ అబ్దుల్ అందించిన పాటలు బాగా హిట్‌ అయ్యాయి. ఈ సినిమాకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంత చక్కగా ఉన్నాయి. ఖర్చుకు ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ కాకుండా పెద్ద సినిమా రేంజ్‌లో తెరకెక్కించారు.

సమాజంలో జరుగుతున్న మెడికల్‌ స్కామ్‌ గురించి వెలికి తీసినట్లు అనిపించింది. మైండ్ కంట్రోల్ అనే కథను తెరపైకి తీసుకు రావడంలో అనేక లోపాలు ఉండటం వల్ల సైంటిఫిక్ థ్రిల్లర్ పర్పస్ నెరవేరలేదనిపిస్తుంది. నటీనటుల యాక్టింగ్‌,, సాంకేతిక విలువలు, బడ్జెట్ పరంగా అన్నీ కూడా చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. కథ, కథనాలపై ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే ఇంకా బావుండేది. ఓవరాల్‌గా ఇది ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చక్కని చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: