దంత వైద్యంలో నానోటెక్నాలజీని ఉపయోగించి బలమైన, మన్నికగల కృత్రిమ దంతాల పూరకాలను తయారుచేసి యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఇండియన్-అమెరికన్ రసాయన శాస్త్రవేత్త సుమిత మిత్ర తాజాగా యూరప్ యొక్క ప్రతిష్టాత్మక ఆవిష్కరణ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆమె దంత వైద్యంలో ఉపయోగించిన నానో టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా డెంటిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆమె దంత వైద్యంలో కనిపెట్టిన నానో టెక్నాలజీ ఆవిష్కరణలను అనుసరిస్తూ డెంటిస్టులు బలమైన, మరింత సౌందర్యమైన పూరకాలను ( విరిగిపోయిన లేదా పుచ్చిపోయిన పళ్ళులో నల్లటి భాగాన్ని తొలగించి పళ్ళ లాగానే ఉండే తెల్లటి పార్టికల్స్ తో నింపేవి) ఉత్పత్తి చేస్తున్నారు.

దంత వైద్యంలో ఎంతో ఉపయోగకరమైన నూతన ఆవిష్కరణలకు నాంది పలికిన సుమిత మిత్ర తాజాగా "నాన్-ఈపీవో దేశాలు" విభాగంలో యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2021 గెలిచారు. ఈ పరిశోధకురాలు దంత వైద్యంలో నానోక్లస్టర్స్ ఉపయోగించవచ్చని.. వీటి వల్ల దంత పూరకాలు మరింత బలంగా, స్థిరంగా, అందంగా ఉంటాయని ఆమె కనుగొన్నారని యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

అయితే ఆమె ఆవిష్కరణలకు ముందు ఉపయోగించిన దంత పూరకాలు చాలా బలహీనంగా ఉండేవి. గట్టిగా ఉన్న పదార్థాలను కొరకటం వల్ల ఈ పూరకాలు బలహీనంగా మారేవి లేదా పాలిష్(నునుపు) కోల్పోయేవి. కానీ ఆ సమస్యలను అధిగమించేందుకు సుమిత మిత్ర నానో క్లస్టర్ ని దంత వైద్యానికి పరిచయం చేసి దంత సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించారు. ప్రస్తుతం ఆమె కనిపెట్టిన ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల డెంటల్ క్లినిక్స్ లలో వినియోగిస్తున్నారు.  

సుమిత మిత్రా తన ఫీల్డ్ లో కొత్త మార్గాన్ని ఎంచుకొని సాంకేతిక ఆవిష్కరణలు ఒక రంగాన్ని ఎంతలా మార్చేస్తాయో చేసి చూపించారు. ఆమె కారణంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల డెంటల్ పేషెంట్స్ ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టి 20 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇదే ఆవిష్కరణను ఉపయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: