పాపం పాకిస్తాన్.. ఉగ్రవాదులతో పాకిస్తాన్ చేసే చేష్టలకు పాపం అనలేమెమో గాని.. పాకిస్తాన్ ప్రభుత్వ తీరు కారణంగా ఆర్థిక సంక్షోభంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి మాత్రం పాపం అనలేకుండా ఉండలేము. ఎంతైనా మన వాళ్లది జాలిగుండె కదా శత్రువు కష్టాల్లో ఉన్న పాపం అంటూ జాలి చూపిస్తూ ఉంటారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఎక్కడ అప్పు దొరుకుతుందా అని అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఇక ఏదైనా దేశం అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అంటే చాలు దేవుడు వరం ఇచ్చాడు ఏమో అన్నట్లుగా సంబరపడిపోతుంది.



 ఇలా ఇప్పటికే ఎన్నో దేశాల దగ్గర అప్పులు తీసుకుని దీన స్థితిలోకి వెళ్లిపోయింది. పాపం నిన్నటి వరకు పాకిస్తాన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా సౌదీ అరేబియా అయ్యో పాపం అంటూ సహాయం చేసేది.. కానీ సహాయం చేసిన వాడి నెత్తి మీదే చెయ్యి పెట్టాలి అన్న విధంగా ఏకంగా సౌదీ అరేబియా లాంటి దేశా పై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించింది పాక్.  దీంతో ఆగ్రహించిన సౌదీ అరేబియా మా అప్పుల వెంటనే చెల్లించాలి ఒత్తిడి చేసింది. ఇంకేముంది అప్పులు ఇచ్చి ఆధిపత్యాన్ని సాధించాలనుకున్న చైనా దగ్గర చేయి చాచడంతో అడిగిన దానికంటే ఎక్కువ అప్పే ఇచ్చింది చైనా.


 చుట్టుపక్కల ఉన్న దేశాలలో కూడా అప్పులు చేసింది. కానీ ప్రస్తుతం ఎక్కడ అప్పుడు దొరికే పరిస్థితి మాత్రం లేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ అప్పు కోసం కొత్త ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో చైనాలో బీజింగ్ ఒలంపిక్స్ జరగబోతున్నాయి. ఈ ఒలంపిక్స్  ప్రారంభానికి చైనా మిత్ర దేశాలైన రష్యా పాకిస్థాన్ అధ్యక్షులను అతిధులుగా ఆహ్వానించింది చైనా. ఇక ఇదే సమయాన్ని అప్పు కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తుంది పాకిస్థాన్. బీజింగ్ ఒలంపిక్స్ ప్రారంభానికి వెళ్లి 3 ట్రిలియన్ డాలర్ల అప్పును అడగడానికి ప్లాన్ సిద్ధం చేసుకుందట పాకిస్తాన్. మరీ ప్లాన్ సక్సెస్ అవుతుందా అప్పు దొరుకుతుందో లేదో అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: