కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడ నిరాటంకంగా జరుగుతుండడంపట్ల సిఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేసారు.  ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంలో కృషి చేసిన నీటి పారుదల శాఖాదికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను సిఎం నిన్న అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉందన్నారు. ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో  రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులకు సిఎం ఆదేశాలు ఇచ్చారు.

మంగళవారం మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని సందర్శించిన ఆయన సతీమణి శోభ, మంత్రులు,ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్  రూపొందించి అమలు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే  రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను నెమరు వేసున్నారు.

సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోసను అనుభవించింది అని సిఎం అన్నారు.  తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే  రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేందుకు అవసరమైన సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్నాం అని ఆయన తెలిపారు. అటు ప్రాణహిత,ఇటు గోదావరి రెండు నదుల నీళ్లు కలిసిన తరువాత బ్యారెజి నిర్మాణం చేపడితే ఎక్కువ కాలం పాటు కావలసినంత నీళ్లు పంపింగ్ చేయవచ్చని వ్యూహం రూపొందించామని చెప్పారు. వ్యాప్కోస్ తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి  మేడిగడ్డ  పాయింట్ వద్ద బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని సిఎం పేర్కొన్నారు.  16.17 టిఎంసీల నీటి నిలువ సామర్ద్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడం వల్ల దాదాపు 7 నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చని అంచనా వేశామని అన్నారు.  అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నదని ఆయన అన్నారు.  99.7 మీటర్ల ఎత్తులో 16.17 టింఎంసీల నీరు నిలువ వున్నదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: