మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం.. సోషల్ మీడియాలో మనం పెట్టే ఒక్కో పోస్టు చాలా మంది ఫాలో అవుతారు.  మన పోస్టులు, లైకులు, కామెంట్లు చూసి..  మన మూడ్‌ ను డిసైడ్ చేస్తారు. మనమేంటో అంచనా వేస్తారు.. ఇక సెలబ్రెటీల సంగతి చెప్పనక్కర్లేదు.. వాళ్లు పెట్టే ఒక్కో పోస్టును కోట్ల మంది చూస్తుంటారు. అందుకే వారు పెట్టే ఒక్కో కామెంట్‌ను బట్టి చాలా మంది ఓ అంచనాకు వస్తుంటారు. అలాంటి సెలబ్రెటీలు, ప్రముఖులు సోషల్ మీడియా పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి..


ఇందుకు ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత.. ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ ఒక తాజా ఉదాహరణ. ఎందుకంటే.. ఆయన ఒక్క ట్వీట్‌.. ఒకే ఒక్క ట్వీట్‌తో భారీగా నష్టపోయారు. బిట్‌కాయిన్‌లపై ఆయన చేసిన ట్వీట్‌ బాగా వైరల్‌ అయ్యింది. అదే ఎలాన్ మస్క్ కొంప ముంచింది. ఇంతకీ మస్క్ ఏం ట్వీట్ పెట్టారంటే.. ఆయన క్రిప్టోకరెన్సీపై మస్క్‌ ట్విటర్‌లో స్పందించారు. చూస్తుంటే బిట్‌కాయిన్‌, ఎథర్‌ క్రిప్టోకరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లు అన్పిస్తోంది అని కామెంట్ పెట్టారు.


అంతే.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎప్పుడూ బిట్‌కాయిన్‌కు అనుకూలంగా మాట్లాడే మస్క్‌.. ఇలాంటి అభిప్రాయం చెప్పడంతో ఆ ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. అది మార్కెట్‌కు నెగిటివ్ సంకేతాలు ఇచ్చింది. అంతే.. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో టెస్లా షేరు విలువ అమాంతం 8.6శాతం కుంగింది. 2020 సెప్టెంబరు తర్వాత కంపెనీ షేర్లు ఇంత భారీగా పడిపోవడం మళ్లీ ఇప్పుడే.. ఈ ట్వీట్ తెచ్చిన  తాజా పతనంతో మస్క్‌ నికర సంపద 15.2 బిలియన్‌ డాలర్లు... మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. అక్షరాలా కోటీ 10లక్షల కోట్లు ఆవిరైపోయింది.


ప్రస్తుతం ఆయన సంపద 183.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది. అంటే.. ఆయన కేవలం ఒకే ఒక్క రోజులో ఆయన 15 బిలియన్‌ డాలర్లు కోల్పోయారు. అదీ కేవలం ఒక్క ట్వీట్ కారణంగా. గత ఏడాది కాలంగా 400శాతం పెరిగిన క్రిప్టోకరెన్సీ విలువ మస్క్‌ ట్వీట్‌ తర్వాత పడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: