తమిళనాడులోని ఊటీ దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదం ప్రస్తుతం దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో భారత రక్షణ రంగానికి చెందిన కీలకమైన అధికారులు ఉండటం గమనార్హం.. భారత రక్షణ రంగానికి మొదటి త్రివిధ దళాధిపతి గా కొనసాగుతున్న బిపిన్ రావత్ కూడా ఈ హెలికాప్టర్ లో ఉన్నారు. ఆయన తో పాటు ఆయన సతీమణి, కమాండర్ స్థాయి అధికారులు హెలికాప్టర్లు ఉన్నట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. అయితే ఇక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి కూడా మృతి చెందారు. పలువురు కమాండర్ స్థాయి అధికారులు కూడా మరణించడం గమనార్హం.


 తమిళనాడు లోని నీలగిరి కొండల్లో నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ హెలికాప్టర్ కుప్పకూలినా ఘటన దేశాన్ని మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారించినట్లు సమాచారం.  అయితే వెల్లింగ్టన్ లో ఉన్న సైనిక అధికారుల శిక్షణ కళాశాల కేంద్రానికి ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కోయంబత్తూర్ ఆర్మీ సెంటర్ నుంచి హెలికాప్టర్ బయలుదేరింది. కానీ అంతలోనే హెలికాప్టర్ ఊటీ దగ్గర కుప్పకూలడం గమనార్హం. అయితే హెలికాప్టర్ కుప్ప కూలడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.


 అయితే బిపిన్ రావత్ ప్రయాణించిన ఐఏఎఫ్ mi-17 v5 హెలికాప్టర్ అత్యాధునిక సాంకేతికతతో కూడినది. ఎలాంటి ప్రమాదాలను అయినాసరే ముందుగానే హెచ్చరిస్తూ ఉంటుంది. రష్యాకు చెందిన ఖజాన్ సంస్థ హెలికాప్టర్ ను తయారు చేసింది. హెలికాప్టర్ లో నాలుగు మల్టీ ఫంక్షన్ డిస్ప్లేలు, నైట్ విజన్ వెపన్స్, ఆన్ బోర్డ్ వెదర్ రాడార్ ఆటో పైలెట్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఇక ఈ అధునాతన సాంకేతిక తో కూడిన ఈ హెలికాఫ్టర్ పూర్తిగా డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ లతో పనిచేసే హెలికాప్టర్. ఇక ఇలాంటి హెలికాప్టర్లను చాలా దేశాలు ఆర్మీ లో ఉపయోగిస్తూ ఉంటాయ్. రాష్ట్రపతి, ప్రధానమంత్రి  లాంటి ప్రముఖులు ఎక్కువగా ఇలాంటి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇంత అత్యాధునికమైన హెలికాప్టర్ ఎలా కుప్పకూలింది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: