తమిళనాడు లోని నీలగిరి కొండల్లో నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ హెలికాప్టర్ కుప్పకూలినా ఘటన దేశాన్ని మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారించినట్లు సమాచారం. అయితే వెల్లింగ్టన్ లో ఉన్న సైనిక అధికారుల శిక్షణ కళాశాల కేంద్రానికి ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కోయంబత్తూర్ ఆర్మీ సెంటర్ నుంచి హెలికాప్టర్ బయలుదేరింది. కానీ అంతలోనే హెలికాప్టర్ ఊటీ దగ్గర కుప్పకూలడం గమనార్హం. అయితే హెలికాప్టర్ కుప్ప కూలడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
అయితే బిపిన్ రావత్ ప్రయాణించిన ఐఏఎఫ్ mi-17 v5 హెలికాప్టర్ అత్యాధునిక సాంకేతికతతో కూడినది. ఎలాంటి ప్రమాదాలను అయినాసరే ముందుగానే హెచ్చరిస్తూ ఉంటుంది. రష్యాకు చెందిన ఖజాన్ సంస్థ హెలికాప్టర్ ను తయారు చేసింది. హెలికాప్టర్ లో నాలుగు మల్టీ ఫంక్షన్ డిస్ప్లేలు, నైట్ విజన్ వెపన్స్, ఆన్ బోర్డ్ వెదర్ రాడార్ ఆటో పైలెట్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఇక ఈ అధునాతన సాంకేతిక తో కూడిన ఈ హెలికాఫ్టర్ పూర్తిగా డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ లతో పనిచేసే హెలికాప్టర్. ఇక ఇలాంటి హెలికాప్టర్లను చాలా దేశాలు ఆర్మీ లో ఉపయోగిస్తూ ఉంటాయ్. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి ప్రముఖులు ఎక్కువగా ఇలాంటి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇంత అత్యాధునికమైన హెలికాప్టర్ ఎలా కుప్పకూలింది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.