చిత్తూరు జిల్లా రచ్చబండ కార్యక్రమం లో పాల్గొనడానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బేగంపేట లోని క్యాంపు కార్యాలయం నుండి విమానాశ్రయానికి వెళ్లడం జరిగింది. విమాన ప్రయాణానికి వాతావరణం సరిగాలేదని అధికారులు తెలపడం జరిగింది. ప్రయాణం ప్రారంభించిన కొద్ది సేపటికే ఆ విమానం నుండి సమాచారం అందడం ఆగిపోయింది. అందుకు గల కారణాలు వెతకడం ద్వారా 15 నిముషాల తరువాత ఆ విమానం ప్రకాశం-కర్నూలు సరిహద్దులలోని రోళ్లపెంట సమీపంలో ప్రయాణిస్తున్నట్టుగా సిగ్నల్ లభించింది. అంతలోనే కేవలం ఐదు నిముషాలలో మళ్ళీ సిగ్నల్ పూర్తిగా పోయింది. దీనితో ఆందోళనకు గురైన అధికారులు తగిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

అయితే ఈ సంఘటనకు ముందుగా గంట క్రితం సాధారణంగా వైఎస్ఆర్ ప్రయాణించే విమానం ప్రయాణానికి సిద్ధంగా లేదు. దానిగురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అది సర్వీస్ లో ఉన్నదని, అందుకే మరొకటి ఏర్పాటు చేసినట్టుగా వారు సమాధానం ఇచ్చారు. అప్పటికి వైఎస్ఆర్ దీనితో సమస్య ఏమీ లేదుకదా అని అడిగారు కూడా. దానికి అధికారులు అలాంటివి ఏమి లేవు, ప్రయాణానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే వాతావరణం అనుకూలంగా లేదని, కొంతసేపు ఆగాలని కూడా తెలిపారు. దీనితో ఆయన ప్రయాణం ప్రారంభించాలని ఆదేశించడంతో, అధికారులు చేసేది లేక పది నిముషాలలో ప్రయాణం ప్రారంభించేశారు.

కానీ, నల్లమల వద్ద సిగ్నల్ పూర్తిగా కోల్పోవడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు, ఒకపక్క బోరున వర్షం కూడా పడుతుంది. అందుకని ఆయన ఎక్కడైనా సేఫ్ గా ల్యాండ్ అయ్యి ఉండొచ్చు అని అధికారులు కూడా భావించారు. అలా అనుకున్నప్పటికీ కూడా దానికి సంబందించిన సమాచారం కూడా ఎంతసేపటికి లేకపోవడంతో అన్ని విభాగాలకు ఈ విషయంపై సమాచారం ఇవ్వడం జరిగింది. సీఎం హెలికాప్టర్ కనిపించకుండా పోయింది అని మీడియా ద్వారా కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎన్నో ఊహాగానాలకు ఇది తావిచ్చింది. కొందరు మంత్రులు ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఆయన ప్రయాణించిన విమానం ఆచూకీ దొరకలేదని ఆర్థిక మంత్రి రోశయ్య మీడియా ద్వారా తెలిపారు, ప్రభుత్వం ద్వారా నల్లమల ప్రాంత ప్రజలకు అక్కడ వెతకాలి అని విజ్ఞప్తి కూడా చేశారు. అందరు అటవీప్రాంతాని జల్లెడపట్టినా తెలియకపోవడంతో అదికూడా చీకటి పడటంతో అందరు వెనకకు తిరిగి రావాల్సి వచ్చింది. అనంతరం తెల్లవారుజామున సుకోయ్ యుద్ధ విమానం ద్వారా వెతుకులాట ప్రారంభించగా, దానికి సిగ్నల్ అందటంతో వైఎస్ఆర్ విమానం కూలిపోయిందని సమాచారం తెలియవచ్చింది. ఇంతకీ కావాలాలని విమానం మార్చబడిందా, యాదృచ్చికంగానే వాతావరణం అనుకూలంగా లేదని చెప్పినా ప్రయాణం చేయడం వలన ఈ ప్రమాదం సంబవించిందా అనేది పెరుమాళ్ళకే ఎరుక!

మరింత సమాచారం తెలుసుకోండి: