స‌మ‌స్య‌లు సృష్టించేదీ ఆయ‌నే, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేదీ ఆయ‌నే..ఆయ‌న న‌ట‌న చూసి ప్ర‌భాస్ తో స‌హా అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని అంటూ యువ ఎంపీ రాము సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

థియేట‌ర్ వివాదాల‌పై అదేవిధంగా టికెట్ ధ‌ర‌ల‌పై ఇటీవ‌ల కాలంలో మెగాస్టార్ చిరు బృందం సీఎం జ‌గ‌న్ ను క‌లిసిన విష‌యం తెలిసిందే! ఇదే వివాదంపై టీడీపీ స్పందిస్తోంది.ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను త‌మ కాళ్ల వ‌ద్దకు ర‌ప్పించుకున్నాం అని అనిపించేందుకునేందుకు,త‌మ ఇగోను సాటిస్ఫై చేసుకునేందుకు ఆ విధంగా ప్ర‌వ‌ర్తించార‌ని ఎంపీ రామూతో స‌హా చాలామంది ఆవేద‌న చెందుతున్నారు.

యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి,అదేవిధంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను తాడేప‌ల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని, ఇంత‌గా దిగ‌జారి ప్ర‌వ‌ర్తించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని అన్నారు.చిరంజీవి అంటే ఇండ‌స్ట్రీకో పెద్ద మ‌నిషి అని,అలాంటిది ఆయ‌న త‌న ఆత్మాభిమానం చంపుకుని జ‌గ‌న్ ద‌గ్గ‌ర చేతులెత్తి న‌మ‌స్క‌రించి మాట్లాడార‌ని, అంత అవ‌స‌రం ఏమొచ్చింద‌ని త‌న ద‌గ్గ‌ర‌ చాలా మంది వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు.ఇవ‌న్నీ చూశాక ముఖ్య‌మంత్రి ఇవాళ ఏ మెంటాలిటీతో ప‌నిచేస్తున్నారో అన్న‌ది గ‌మ‌నించాల‌ని అన్నారు.

ముఖ్యంగా ఇండ‌స్ట్రీ పెద్ద‌ల ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తీసేవిధంగా జ‌గ‌న్ న‌డుచుకోవ‌డం ప‌ద్ధ‌తి కాద‌ని, వాళ్లు కూడా ఓ హోదా ఉన్న వ్య‌క్తులేన‌ని,గౌర‌వ ప్ర‌ద‌మ‌యిన ప‌ద‌వులు నిర్వ‌హించిన వారే అని,అలాంటి వారి విష‌య‌మై సీఎం ప్ర‌వ‌ర్తించిన తీరే బాగాలేద‌ని అన్నారు.త‌ప్పు బ‌ట్టారు.ఏదో గీతోప‌దేశం ఇచ్చిన విధంగా ప్ర‌వ‌ర్తించ‌డం త‌గ‌ద‌ని, ఇంత నీఛ‌మ‌యిన దిగ‌జారుడు సంస్కృతి ఉన్న
నాయ‌కులెవ్వ‌రూ ఉండ‌ర‌ని దుయ్య‌బ‌ట్టారు. దీనిపై త‌ట‌స్థ వాదులు కూడా స్పందించార‌ని, చిరు ఆ విధంగా న‌డుచుకోవ‌డం
త‌గ‌ద‌ని కూడా అన్నార‌ని ప్ర‌స్తావించారు.చిరంజీవి దండం పెట్టింది ఎందుకంటే నాయ‌నా నేనే గొప్ప న‌టుడిని అనుకున్నా..నా క‌న్నా గొప్ప న‌టుడివి నీవు అంటూ మీడియా మీట్ లో న‌వ్వులు పూయించారు.సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఓ క్రేజ్ ఉంటుంద‌ని, వాళ్ల‌నే పిలిపించుకుని పొగిడించుకుంటున్నార‌ని జ‌గ‌న్ ను ఉద్దేశించి సెటైర్లు వేశారు.
 

ఇక విశాఖకు సినీ ప‌రిశ్ర‌మను ర‌ప్పించేందుకు చంద్ర‌బాబే గ‌తంలో ప్ర‌య‌త్నించార‌ని, కానీ ఇప్పుడు ఇలాంటి ప్ర‌తిపాద‌న తీసుకురావ‌డం ఆయ‌న న‌ట‌న‌లో భాగ‌మేన‌ని అన్నారు.ఓవైపు రామానాయుడు స్టూడియో భూములు లాక్కొనేందుకు ప్ర‌య‌త్నిస్తూ మ‌రోవైపు ఇండ‌స్ట్రీ అంటే ప్రేమ ఉంద‌న్న విధంగా న‌టించ‌డం అన్న‌ది ఆయ‌నకే సాధ్యం అయింద‌ని దుయ్య‌బ‌ట్టారు.అదేవిధంగా ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌స్తావించారు. ఎన్నిక‌ల ముందు క‌మ‌ల్ హాస‌న్ ఆక‌లి రాజ్యంలో న‌టించిన విధంగా ప్ర‌వ‌ర్తించార‌ని,త‌రువాత స్వాతిముత్యంలో క‌మ‌ల్ హాస‌న్ మాదిరిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని పెద‌వి విరిచారు.ఇవి చూసి ప్ర‌భాస్ కూడా నాయ‌నా నీ న‌ట‌న‌కో దండం అని అనుకున్నార‌న్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వ‌యొలెన్స్ పెరిగిపోతోంద‌ని, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై క‌ర్ర‌ల‌తో నేరుగా దాడులు చేస్తున్నా పోలీసులు నిలువ‌రించ‌క‌పోగా, స‌హ‌క‌రిస్తున్నార‌ని ఆవేద‌న చెందారు.




మరింత సమాచారం తెలుసుకోండి: