ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారన్న కారణంతో నలుగురు ఎంఎల్ఏలను జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వెంటనే సస్పెన్షన్ వేటు అమల్లోకి వచ్చింది. ఈ విషయాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా చెప్పారు. సజ్జల మాట్లాడుతు నలుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబునాయుడు తలా రు. 15-20 కోట్లు ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని ప్రలోభపెట్టినట్లు ఆరోపించారు.





పోలింగ్ జరిగి, ఫలితాలు వచ్చిన 24 గంటల్లోపే పార్టీ నుండి సస్పెండ్ చేయటం జగన్ మార్క్ యాక్షన్ అనే చెప్పాలి. ఇందులో ఆనం, కోటంరెడ్డి కొంతకాలంగా రెబల్ గా తయారయ్యారు. కాబట్టి వాళ్ళు వైసీపీ అభ్యర్ధులకు ఓట్లేస్తారని అనుకోలేదు. అయితే వీళ్ళతో పాటు మరో ఇద్దరు ఎంఎల్ఏలు టీడీపీకి ఓటు వేయటంతో వైసీపీ తరపున పోటీచేసిన ఏడుగురిలో కోలా గురువులు ఓడిపోయారు. నిజంగా ఇది జగన్ కు పెద్ద అవమానంగానే భావించాలి.





అయితే ఇదే సమయంలో చంద్రబాబు ప్రలోభాల పర్వం మరోసారి బయటపడింది. 2014-19 మధ్యలో కూడా వైసీపీ తరపున గెలిచిన వారికి డబ్బు, పదవులు, టికెట్లు, మంత్రిపదవులని ప్రలోభాలకు గురిచేసి 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే.





అదే పద్దతిని ప్రతిపక్షంలో ఉన్నాకూడా  చంద్రబాబు ఇంకా  కంటిన్యు చేస్తునే ఉన్నారు. ఇదే విషయాన్ని సజ్జల మాట్లాడుతు ఓటింగ్ పై  అంతర్గతంగా విచారణ జరిపిన తర్వాతే నలుగురిని సస్పెండ్ చేయాలని జగన్ డిసైడ్ చేసినట్లు చెప్పారు. ఇదే విషయమై కోటంరెడ్డి, మేకపాటి  మాట్లాడుతు తమను సస్పెండ్ చేయటం సంతోషంగా ఉందన్నారు. మేకపాటి మాట్లాడుతు తాను పార్టీ చెప్పిన వాళ్ళకే ఓటేసినట్లు చెప్పారు. కోటంరెడ్డి మాట్లాడుతు సస్పెండ్ చేసిన విధానం తప్పన్నారు. మొత్తంమీద 24 గంటల్లోగా 4 ఎంఎల్ఏలపై జగన్ యాక్షన్ తీసుకోవటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: