దాదాపు 3 సంవత్సరాల క్రితం నవంబర్ నెలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఈ ప్రకటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు.  మోదీ ప్రభుత్వం ఆ తరువాత కొత్త 500 రూపాయల నోట్లు, కొత్త 2,000 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. 
 
ప్రజలకు 2,000 రూపాయల నోట్లు ఉపయోగించటం సాధారణమైంది. ఏటీఎంలలో కూడా 2,000 రూపాయల నోట్లు ఎక్కువగా వచ్చేవి. కానీ కొన్ని నెలల నుండి 2,000 రూపాయల నోట్లు ఎక్కువగా కనిపించటం లేదు. 500 రూపాయల నోట్లు అందుబాటులో ఎక్కువగా ఉన్నా 2,000 రూపాయల నోట్లు మాత్రం అంతగా కనిపించటం లేదు. మరోవైపు ఆర్బీఐ 2,000 రూపాయల నోట్ల ముద్రణను కొన్ని నెలల నుండి నిలిపివేసింది. 
 
సమాచార హక్కు చట్టం ద్వారా ఒక వార్తాసంస్థ ఆర్బీఐని 2,000 రూపాయల నోట్ల గురించి అడగటంతో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. 2019 - 2020 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఒక్క 2,000 రూపాయల నోటును కూడా ముద్రించలేదు. ఆర్బీఐ 2,000 రూపాయల నోట్ల ముద్రణ ఆపివేయటంతో ఈ నోట్లు రద్దు కాబోతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. గత కొంతకాలంగా సామాన్యులు కూడా ఈ నోట్లు రద్దు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
 
నోట్ల రద్దు జరిగిన తరువాత ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క 2,000 రూపాయల నోటు కూడా ముద్రించకపోవటంతో నోట్ల రద్దు గురించి ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల నోట్ల రద్దు గురించి స్పష్టత ఇస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిపుణులు నల్లధన ప్రవాహానికి ఎక్కువ విలువ గల నోట్ల చలామణిని తగ్గించటం ద్వారా అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. మరి 2,000 రూపాయల నోట్ల రద్దు వార్తలు నిజమా ? కాదా ? అనే విషయం గురించి కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం రావాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: