నిన్నటికి నిన్న ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ మీడియట్ విద్యార్థుల పరీక్షలకు షెడ్యూల్ విడుదల చెయ్యగా ఈరోజు పదోవ తరగతి విద్యార్థులకు షాక్ ఇస్తూ పరీక్షలకు కస్టపడి చదివే సమయం ఆసన్నమయింది అంటూ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో పదోవ తరగతి పరీక్షల షెడ్యూల్ ఈరోజు విడుదల అయ్యింది. 

 

ఇంటర్మీడియెట్‌ వారి పరీక్షలు మార్చి 4 నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ నిన్న పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 4 నుంచి మొదటి సంవత్సరం, 5 నుంచి రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలు మార్చి 23 వరకు నిర్వహించనున్నారు. 

 

ఇంటర్ పరీక్షలు అనంతరం 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు పదోవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ను ప్రకటించారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కాగా ఏ రోజు ఏ పరీక్షలు అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

పరీక్షల షెడ్యూల్‌... 

 

మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1

 

మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

 

మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌

 

మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1

 

మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌ 2

 

మార్చి 30 : గణితం పేపర్‌ 1

 

మార్చి 31 : గణితం పేపర్‌ 2

 

ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1

 

ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2

 

ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1

 

ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2

 

ఏప్రిల్‌ 07 : సంస్కృతం, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌

 

ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు

మరింత సమాచారం తెలుసుకోండి: