ఇప్పుడు రాజకీయాల్లో స్వామీజీల జోక్యం బాగా ఎక్కువై పోతోంది. ఒక విధంగా చెప్పాలంటే అటు రాజకీయ నాయకులకు, బడా వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు ఈ స్వామీజీలు సంధాన కర్తలుగా మారుతున్నారు. అనేక లావాదేవీలను వీరు చక్కబెడుతున్నారు. వీరి రేంజ్ ఓ స్థాయికి చేరిందంటే.. ఏకంగా ముఖ్యమంత్రులకే వీరు సిఫార్సులు చేస్తున్నారు. ఇలాంటి జోక్యం సదరు నాయకులకు తలనొప్పిగా మారుతోంది.

 

మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఈ స్వామీజీల జోక్యం కనిపిస్తుంది కానీ.. మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మొదటి నుంచి మఠాలు, స్వామీజీల ప్రభావం చాలా ఎక్కువ. ఇక్కడ నాయకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం స్వామీజీల చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే.. సదరు స్వామీజీలకు ఓటర్లను ప్రభావితం చేసే శక్తి ఎక్కువ. అయితే ఆ స్వామీజీల అండ ఎన్నికల తర్వాత గుదిబండగా మారుతుంది. ఎందుకంటే గెలిచిన తర్వాత ఆ స్వామీజీ ఏదో ఒక సిఫార్సు చేస్తుంటారు కదా.

 

ఇప్పుడు కర్ణాటకలో అదే జరిగింది. ఓ స్వామీజీలు ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వండనిఏకంగా సీఎంకు సలహా ఇస్తున్నారు. అదీ పబ్లిక్ గా.. దీంతో కర్ణాటక సీఎం యడ్యూరప్ప సదరు స్వామీజీపై చిరాకుపడుతున్నారట. చివరికి కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. ఈ గోల నేను తట్టుకోలేను బాబోయ్. రాజీనామా చేసిపడేస్తా అనే రేంజ్ కు వెళ్లిపోయారట.

 

దావణగెరె జిల్లాలోని హరిహరలో జాతర మహోత్సవంలో వచనానంద స్వామీజీ పంచమశాలి.. ఓ సభలో మాట్లాడుతూ మురుగేష్‌ కి మంత్రి పదవి ఇవ్వాలని యడ్యూరప్పకు బహిరంగంగా సూచించారట. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే వీరశైవ పంచమశాలి వర్గం మీకు దూరం కాబోతుందని వార్నింగ్ ఇచ్చారట. దీంతో చిరాకుపడిన యడ్యూరప్ప.. రాజీనామా అయినా చేస్తాను కానీ ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదంటున్నారట. అంటే ఆ రేంజ్ లో స్వామీజీలు అక్కడ సీఎం ను బెదిరిస్తున్నారన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: