లాక్ డౌన్ సమయంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఇందుకు సినీ, టీవీ రంగాలు మినహాయింపేమీ కాదు. కానీ.. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే చిక్కుకుపోయిన జనానికి కాస్త ఊరడింపు వినోదమే. అదే లేకపోతే..జనం పిచ్చెక్కిపోతారు. ఇళ్లలోనే ఎంతకాలం ఉండగలుగుతారు. మరి అలాంటి వారికి టీవీ ఛానళ్లు కూడా వేసిన ప్రోగ్రాములే వేసి బోర్ కొట్టిస్తున్నాయి.

 

 

అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని టీవీ సీరియళ్లు షూటింగ్ చేసుకుంటాం.. అనుమతివ్వండి అంటూ టీవీ ఛానళ్ల నిర్వాహకులు తెలంగాణ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. ప్రజలకు వినోదం అందించేందుకు ప్రభుత్వ నిబంధనలకు లోబడి టీవీ షూటింగ్ లకు అనుమతివ్వాలని పలు ఛానెళ్ల నిర్వాహకులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాయి. తెలుగులో ప్రముఖ చానళ్లయిన ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు, జెమిని టీవీ నిర్వాహకులతో పాటు తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛైర్మన్... తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కలసి వినపతిపత్రం అందించారు.

 

 

లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారని వారికి వినోదం కోసం టీవీ షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతే కాదు.. సినిమాలతో పోలిస్తే టీవీ షూటింగ్ లకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని వివరించాు. ప్రభుత్వ నిబంధనలకు లోబడే షూటింగ్ లను నిర్వహిస్తామని మంత్రికి వారు వివరించారు.

 

 

అయితే దీనిపై మంత్రి తలసాని శ్రీనివాసయాద్ నుంచి ఎలాంటి హామీ లభించలేదని చెప్పాలి. ఈ నెల 5న మంత్రివర్గ సమావేశం ఉందని.. అందులో ఈ అంశాన్ని చర్చించి పరిశీలిస్తామని తలసాని చెప్పారట. టీవీ షూటింగులకు అనుమతిస్తే.. సినిమా వాళ్లూ అడుగుతారు. మరి వాళ్లకేం చెప్పాలి అన్నది బహుశా తెలంగాణ సర్కారు ఆలోచన కావచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: