భారత దేశంలో రోజురోజుకు మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్న ప్రజల సహకారం లేకపోవడం తో రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇక కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితి అయితే ఏకంగా దేశానికి శాపం గా మారిపోతుంది. ముఖ్యంగా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అక్కడ ఏకంగా పరిస్థితుల్లో రోజురోజుకు చేయు దాటిపోతున్నాయి. రోజురోజుకీ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరగడమే కాదు ఎంతో మందిని ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడుతున్నారు. 

 


 ముఖ్యంగా దేశంలో ఎక్కువగా మహమ్మారి వైరస్ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలలో కరోనా  విజృంభిస్తున్న తీరు ఏకంగా దేశానికి శాపం గా మారిపోతుంది. ప్రభుత్వ అసమర్థత... అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల నిర్లక్ష్యం..  వెరసి రోజు రోజుకు కరోనా  కేసులు  పెరిగిపోతున్నాయి. ఇక అక్కడి ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే మహారాష్ట్రలో అయితే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా దేశంలో నెలకొన్న మొత్తం కరోనా కేసుల్లో  సగం కేసులు కేవలం ఒక్క మహారాష్ట్రలోని ఉండటం గమనార్హం. దేశంలో ఇప్పటి వరకు ఏకంగా లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు ఉండగా కేవలం ఒక మహారాష్ట్రలోని 47,192 కరోనా  కేసులు నమోదయ్యాయి. 

 

 కాగా  ఇప్పుడు వరకు మహారాష్ట్రలో  13, 404 మంది కోలుకున్నారు... ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఇప్పుడు వరకు 1577 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు తమిళనాడులో కూడా రోజుకు కరోనా సంఖ్య పెరిగిపోతుంది. తమిళనాడులో ఇప్పుడవరకు  ఏకంగా 15,512 కేసులు  ఉన్నాయి. గుజరాత్ లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. గుజరాత్  ఏకంగా 13, 664 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజధాని ఢిల్లీలో కూడా మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య ఎక్కువ అయిపోతుంది. ఢిల్లీలో ఇప్పటి వరకు  12, 910 కరోనా  కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: