టాలీవుడ్ సినీ పెద్దలతో మంత్రి తలసాని శ్రీనివాస్ భేటీ వ్యవహారంపై తాజాగా సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే లేపాయి. ఎవడు పిలిచాడండీ నన్ను.. నన్ను ఎవడూ పిలవలేదు.. ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తో కలసి వీళ్లంతా భూములు పంచుకుంటున్నారా.. ... బీప్.. బీప్.. బీప్.. బీప్.. ఇదీ నందమూరి బాలకృష్ణ సినీ పెద్దల సమావేశంపై చేసిన వ్యాఖ్యలు.

 

 

ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పటి నుంచి కలకలం రేపుతున్నాయి. దీనికి తోడు దీనికి కౌంటర్ గా నాగబాబు.. బాలయ్య నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ పెట్టిన వార్నింగ్ వీడియో ఇంకాస్త వేడిని పెంచేసింది. ఈ వ్యవహారాన్ని టీఆర్పీ రేటింగ్‌తో సొమ్ము చేసుకోవాలని ఓ టీవీ ఛానల్ ప్రయత్నించింది. ఏకంగా నాగబాబును ఈ అంశంపై డిబేట్ కు పిలిపించింది. అయితే తెలుగు దేశం తోక పత్రికగా చెప్పుకునే డైలీకి అనుబంధంగా ఉన్న ఆ ఛానల్‌ లో డిబేట్‌కు ఓకే చెప్పిన నాగబాబు ఆ తర్వాత యాంకర్ కు చుక్కలు చూపించారు.

 

 

నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సీఐడీ తరహాలో ఇంటరాగేషన్ చేయబోయిన యాంకర్‌ కు నాగబాబు మొదట్లోనే అడ్డుకట్ట వేశారు. మీ చానల్ సంగతి అందరికీ తెలిసిందే. ఇది నూటికి నూరు శాతం తెలుగుదేశం అనుకూల ఛానల్. ఆ విషయం అందరికీ తెలుసు. నాకూ తెలుసు కానీ .. మీరంటే ఉన్న కన్సర్న్‌ తో డిబేట్ కు ఒప్పుకున్నారు. మీరు మరీ అడ్డంగా వాదించరని నాకు తెలుసు అంటూ ముందర కాళ్ల బంధం వేశారు నాగబాబు.

 

 

నాగబాబు.. మీది టీడీపీ అనుకూల ఛానల్ అంటూ లైవ్ లోనే ఏకేస్తుంటే పాపం.. ఆ యాంకర్ కు ఏం చేయాలో ఒక్కసారిగా పాలుపోలేదు. దీనికి సమాధానం చెప్పలేక.. విషయాన్ని సినీ ఇండస్ట్రీ రాజకీయాలవైపు చాకచక్యంగా తిప్పి డిబేట్ ను కాస్త పక్కదారి పట్టించేశారు. అయితే ముందుగానే సిద్ధంగా వచ్చిన నాగబాబు మాత్రం డిబేట్ ఆసాంతం సదరు యాంకర్‌ను ఇబ్బంది పెడుతూనే పై చేయి సాధించారనే చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: