తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి.. రెండు రాష్ట్రాల మధ్య పోలికలు సహజంగానే వస్తుంటాయి. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఈ పోలికలు చూస్తున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు ఈ పోలికలు విమర్శలకూ దారి తీస్తున్నాయి. కరోనా విషయంలో మొదట్లో కేసీఆర్ బ్రహ్మాండంగా పని చేసినట్టు విశ్లేషణలు వచ్చాయి. 

 


కానీ ఇటీవల కేసీఆర్ అసలు బయటకే రావడం లేదు. అదే సమయంలో ఏపీలో లక్షల సంఖ్యలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ కరోనా రేసులో ప్రస్తుతానికి జగన్ దే పైచేయి అని విశ్లేషకులూ భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనే విపక్ష నేతలు కేసీఆర్ ను జగన్ తో పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.  

 

IHG


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా ఏపీ సీఎం వైఎస్ జగన్ వంద అడుగులు ముందు ఉన్నారంటున్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ విషయం తాను కావాలని అనడం లేదని... , జగన్ చేపట్టిన స్కీములు కాని, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు కాని ఇవన్ని కూడా ఆయనకు పేరు తెస్తున్నాయని కోమటి రెడ్డి అంటున్నారు. 

 


వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు అనుబంధం పాతికేళ్లనాటిదని, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీరహితంగా అందరిని ఆదరించారని కోమటిరెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని కోమటిరెడ్డి అంటున్నారు. జగన్ పాలన రాజశేఖరరెడ్డి పాలనకన్నా రెండు అడుగుల ముందు వేస్తున్నట్లుగా ఉందా అని అడిగితే, అదేమో కాని.. కేసీఆర్ పాలన కన్నా వంద అడుగుల ముందు ఉందని కోమటిరెడ్డి కామెంట్ చేయడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: