దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ దేశంలోని ప్రజలందరిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిజానికి కరోనాకు కారణమయ్యే వైరస్ స్వంతంగా జీవించదు. వైరస్ శరీరంలోకి ప్రవేశించాక శరీరంలోని రోగ కారక బాక్టీరియాకు సహకరించి వేలాది వైరస్ లను తయారు చేస్తుంది. 
 
ప్రపంచవ్యాప్తంగా గడిచిన మూడు దశాబ్దాల నుంచి కొత్తకొత్త వైరస్ లు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తక్కువ ప్రదేశంలో ఎక్కువమంది జీవిస్తున్నారంటే వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. కరోనా నుంచి మానవుడికి కలిగే ప్రమాదాలపై జరుగుతున్న పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైరస్ మొదటి కేసు నుండి తీసిన జన్యు శ్రేణి ఆధారంగా చేసిన ప్రయోగాలలో, కణాలకు సోకడానికి వైరస్ ఆ రూపాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. 
 
కానీ ఇప్పుడు వైరస్ తన రూపాన్ని మార్చుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని జన్యు శాస్త్రవేత్త నెవిల్లే సంజన కరోనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్ మానవ కణాల్లోకి ఎలా ప్రసరిస్తుందన్న విషయాన్ని తెలుసుకోవడం అంతా సులువు కాదని జీవశాస్త్రవేత్త పార్డిస్ సబెటి అన్నారు. కరోనావైరస్ యొక్క 50,000 జన్యువులలో 70 శాతం ఉత్పరివర్తనాలకు గురయ్యాయని... జనాలు చాలా దగ్గరగా ఉన్నప్పుడే వైరస్ వ్యాప్తి చెందుతుందని వీళ్లు చెబుతున్నారు. 
 
కరోనా జన్యువు పరివర్తనంపై జరిపిన అధ్యయనంలో నాలుగు ప్రయోగశాలల ప్రయోగాలు మ్యుటేషన్ వైరస్ ను మరింత అంటువ్యాధిగా మారుస్తుందని చెబుతున్నారు. మరోవైపు వైరస్ వ్యాప్తికి కచ్చితమైన ఆధారాల కోసం శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ప్రజలు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు వైరస్ భారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తే మాత్రమే వైరస్ సోకకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: